విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్ లైన్ క్లాసులు

విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్ లైన్ క్లాసులు
x
Highlights

ఆన్ లైన్ క్లాసులు 9వ తరగతి చదివే విద్యార్ధిని ప్రాణాలు తీశాయి. ఈ విషాద సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈనెల 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా...

ఆన్ లైన్ క్లాసులు 9వ తరగతి చదివే విద్యార్ధిని ప్రాణాలు తీశాయి. ఈ విషాద సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈనెల 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విక్టర్ ఛానల్ ద్వారా ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించింది కేరళ ప్రభుత్వం.

విధ్యార్ధిని ఇంటిలో టీవీ పాడవడంతో, తండ్రిని రిపేర్ చేయించమని అడిగింది. విధ్యార్ధిని. తండ్రి దినసరి కూలీ కావడంతో, లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేక పోవడంతో రిపేర్ చేయించలేదు. ఇంట్లో స్మార్ట్ ఫోన్ కాని, లాప్ టాప్ లేకపోవడంతో ఆన్ లైన్ క్లాసులకు హాజరు అవలేని విధ్యార్ధిని, అవమానంగా భావించి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక విషాద ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సి.రవీంద్రనాథ్‌ జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి నివేదిక కోరారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories