Top
logo

మర్యాదగా క్యాబ్‌ దిగుతావా.. లేదా దుస్తులు విప్పాలా..?

మర్యాదగా క్యాబ్‌ దిగుతావా.. లేదా దుస్తులు విప్పాలా..?
Highlights

ఓవైపు దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతునే ఉన్నాయి. ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కానీ మనవమృగాల...

ఓవైపు దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతునే ఉన్నాయి. ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కానీ మనవమృగాల చేతితో స్త్రీ బలి కాకతప్పడంలేదు. ఇదిలా ఉంటే మరోవైపు భారత్‌లో క్యాబ్ డ్రైవర్‌లతో కూడా మహిళలు నానా ఇబ్బందులు పడినటువంటి ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ చోటికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కిన మహిళను తీవ్రంగా వేధించిన ఉబెర్ డ్రైవర్ ఆమెను నోటికి ఎంతవొస్తే అంత అసభ్యపదజాలంతో దూషించాడు. హాలో నువ్వు నా క్యాబ్ దిగి వెళ్తావా లేక నీ బట్టలు విప్పి నడిరోడ్డుపై రచ్చరచ్చ చేయాలా అంటూ యువతిని బెదిరిస్తూ.. నరకయాతన చూపించాడు ఓ ఉబెర్ డ్రైవర్. చివరికి ఆ బాధితురాలు ఉబెర్ కంపెనీ కూడా సాయం చేయలేదు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బాధితురాలు పేరు అపర్ణ. క్యాబ్‌ ప్రయాణంలో తనకు ఎదురైన సంఘటనను అనుభవాన్ని ఆమె ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే... అపర్ణా బాలచందర్ ఓ ప్రాంతానికి వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేశారు. గత రాత్రి నేను స్నేహితులో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. రాత్రి సమయం కావడంతో నా స్నేహితులు ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేశారు.. దీంతో యువతి కార్కెక్కింది. ఇక మార్గమధ్యంలో డ్రైవర్‌ తన దోస్తుతో ఫోన్‌లో మాట్లాడుతూ.. కస్టమర్లను బూతులు తిట్టాడు. అయినప్పటికీ నేను అతని జోలికి పోలేదు. ఇక ఫోన్‌ మాట్లాడం అయిపోయినా తరువాత మెళ్లిగా డ్రైవర్ తన నావైపు తిరిగి.. చూడనికి ఎంతో కొంత చదువుకున్నదానిలా కనిపిస్తున్నావ్‌.. నీ డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్లొచ్చు కదా? ఎందుకు అర్ధరాత్రి వరకు తాగుతారు. రాత్రి 7గంటలలోపు ఇంటికి పోక స్నేహితులతో కలిసి ఎందుకు మందు తాగుతారు' అంటూ నన్ను ప్రశ్నించారు.

వెంటనే నేను అతడి ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను మందు తాగలేదు. నీ పని నువ్వు చూసుకో అని క్యాబ్ డ్రైవర్‌కు జవాబిచ్చా. దీంతో సదరు డ్రైవర్ కోపంతో రగిలిపోతు యువతిపై వ్యక్తిగత దూషణ చేయడం మొదలుపెట్టాడు. నువ్వు ఓ వ్యభిచారిణివి, నా షూలు తుడిచేందుకు కూడా పనికిరావు' అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. దీంతో నేను భయపడిపోయి ఉబెర్ పానిక్ బటన్ నొక్కా... అయితే కంపెనీ నాకు బదులుగా సక్కగా క్యాబ్ డ్రైవర్‌కే ఫోన్ చేసింది. ఫోన్ లిప్ట్ చేసి ఆమె ఫుల్లుగా మద్యం మత్తులో ఉంది' అని జవాబిచ్చాడు. అసలు ఏం జరుగుతుందోనని భయపడ్డ నేను గట్టిగా కేకలు వేశాను. దీంతో వెంటనే కస్టమర్ కేర్ వాళ్లు మీరు వెంటనే కారు దిగిపోండి. మీకు మరో కారు పంపుతాం అని యువతకి చెప్పారు.

దీంతో మరింత రెచ్చిపోయినా క్యాబ్ డ్రైవర్ .. నువ్వు ఇప్పుడు నా కారు దిగకుంటే నీ దుస్తులను నేనే చించేస్తా' అని బెదిరించాడు. దీంతో భయపడ్డనని అప్పుడు రాత్రి 11.15 గంటల సమయంలో నడిరోడ్డుపై నిలబడ్డా. అసలు ఎంతసేపు నిల్చున్నా కానీ ఒక్క ఉబెర్ కారు రాకపోవడంతో చివరికి చేసేది ఏం లేక నా స్నేహితులకు ఫోన్ చేశా. అయితే ఇంత జరిగితే ఉబెర్ ఏం చేసిందో తెలుసా? కేవలం నా డబ్బులు నాకు రీఫండ్ చేసి చేతులు దులుపుకుంది. తరువాత కూడా ఉబర్‌ కంపెనీ నుండి నాకు ఒక్క ఫోన్ కాల్ కుడా రాలేదు. ఒక వేళ నాకు ఆ సమయంలో ఏదైనా జరిగిఉంటే ఎలా? ఎవరు బాధ్యులు? ప్రముఖ ఉబర్‌ సంస్థ తమ కస్టమర్లకు కల్పించే భధ్రత ఇదేనా?.. అంటూ అపర్ణ ట్విటర్‌లో ప్రశ్నించారు. ఇక అమె ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. అయితే తను చేసిన ట్వీట్ చదివిన చాలా మంది తమకు జరిగిన అనుభవాల్ని పోస్ట్‌ చేస్తున్నారు. ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని, ఎన్ని కేసులు నమోదైన కానీ ఆ సంస్థ మాత్రం తగిన చర్యలు తీసుకోవడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్‌కి యవత్ యువతులు మద్దతు తెలుపుతున్నారు. పలు ప్రజాసంఘాలు యువకి జరిగిన ఘటనను ఖండిస్తూ ఇలాంటి ఘటనలు మళ్లీ రిపిట్ కావోద్దంటూ మండిపోతున్నారు. చూడాలి ఇప్పటికైన ఈ క్యాబ్ సంస్థలు ఇలాంటి చర్చలు జరగకుండా.. కస్టమర్లకు భధ్రత కలిప్పిస్తోరా లేదో అనేది వేచిచూడాలి.

Next Story