logo
జాతీయం

ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌
X
Highlights

పుల్వామా ఘటనతో కాకమీదున్న భారత్ ఆర్మీ క్రమమంగా కసి తీర్చుకుంటోంది. శుక్రవారం బారాముల్లా జిల్లా సోపోర్‌...

పుల్వామా ఘటనతో కాకమీదున్న భారత్ ఆర్మీ క్రమమంగా కసి తీర్చుకుంటోంది. శుక్రవారం బారాముల్లా జిల్లా సోపోర్‌ పట్టణంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఘటనలో జవాన్లకు ఎవరికీ గాయాలు కాలేదని దక్షిణ కశ్మీర్‌ డీఐజీ అతుల్‌ కుమార్‌ గోయల్‌ తెలిపారు. సంఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన వారు ఏ ప్రాంతానికి చెందినవారో గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా ఇళ్లను తనిఖీ చేస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపైకి కాల్పులు జరిపారని.. దీంతో ఎదురుకాల్పులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు డీఐజీ చెప్పారు.

Next Story