logo
జాతీయం

ట్విటర్‌ కు షాక్.. కో ఫౌండర్‌ రాజీనామా

ట్విటర్‌ కు షాక్.. కో ఫౌండర్‌ రాజీనామా
X
Highlights

ట్విటర్‌ కో ఫౌండర్, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ఆ సంస్థకు భారీ షాక్‌ ఇచ్చారు. ఆయన తన సభ్యత్వానికి రాజీనామా...

ట్విటర్‌ కో ఫౌండర్, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ఆ సంస్థకు భారీ షాక్‌ ఇచ్చారు. ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్టు వెల్లడించారు. దాదాపు 12 ఏళ్లపాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్‌ అనూహ్యంగా బోర్డునుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. రాజీనామా చేసినా ట్వటర్‌ కు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విలియమ్స్ స్పష్టం చేశారు.

దీంతో ట్విట్టర్ ఉద్యోగులంతా షాక్ లో మునిగిపోయారు. ఈ నెల చివరి నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు వెల్లడించారు.వరుస ట్విట్లలో రాజీనామా విషయాన్నీ విలియమ్స్‌ ధృవీకరించారు. 12సంవత్సరాలపాటు ట్విటర్‌ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Next Story