14 ఏళ్ళు జైలుశిక్ష అనుభవించాడు.. కానీ పట్టువదలకుండా డాక్టర్ అయ్యాడు!

14 ఏళ్ళు జైలుశిక్ష అనుభవించాడు.. కానీ పట్టువదలకుండా డాక్టర్ అయ్యాడు!
x
Highlights

ఓ హత్యకేసులో నిందితుడు అయిన సుభాష్ పాటిల్ 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. కానీ జీవితం అతనికి మరో అవకాశం ఇచ్చింది.

ఓ హత్యకేసులో నిందితుడు అయిన సుభాష్ పాటిల్ 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. కానీ జీవితం అతనికి మరో అవకాశం ఇచ్చింది. దానిని సక్రమంగా వాడుకున్న అతను ఇప్పుడు ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంతకి ఎం జరిగిందో ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ... అఫ్జల్‌పూర్ తాలూకాలోని భోసాగా గ్రామానికి చెందిన సుభాష్ పాటిల్ 1997లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాడు. అక్కడ తన పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళ ప్రేమలో పడ్డాడు. అప్పటికే ఆమెకి పెళ్లి కావడంతో తమ ప్రేమకి అడ్డుగా ఉన్న పద్మావతి భర్త అశోక్ గుట్టేదార్‌ను జూన్ 15, 2002 పద్మావతితో కలిసి చంపేశాడు.

ఈ కేసులో ఇద్దరు జైలు శిక్ష అనుభవించారు. కానీ జైల్లో ఉన్నంతసేపు ఎలాగైనా డాక్టర్ కావాలనే లక్ష్యంగా పెట్టుకొని చదువును కొనసాగించాడు. అతను జైలులో ఉన్నప్పుడు సెంట్రల్ జైలు ఆసుపత్రిలో వైద్యులకు సహాయం చేసేవాడు. క్షయవ్యాధితో బాధపడుతున్న ఖైదీల చికిత్సలో అతను చేసిన కృషికి 2008 లో ఆరోగ్యశాఖ అతనిని సత్కరించింది కూడా..

ఇక 2016లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంచి ప్రవర్తన ఆధారంగా జైలు శిక్షలో రాయితీ పొందిన ఆ ఇద్దరూ జైలు నుండి విడుదలయ్యారు.. బయటకు వచ్చాక తిరిగి ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించుకొని 2019ఎంబీబీఎస్‌ ని పూర్తి చేశాడు. అంతేకాకుండా ఓక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం కర్ణాటకలో డాక్టర్‌గా కొనసాగుతున్నాడు. క్షణిక ఆవేశం కారణంగా ఎక్కువగా జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి జైలుశిక్ష అనేది జీవిత ముగింపు కాదని నిరూపించడానికి డాక్టర్ సుభాష్ పాటిల్ ఒక సాక్ష్యంగా నిలుస్తాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories