పట్టాలెక్కనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఎక్కడ తయారైందో తెలుసా..?

పట్టాలెక్కనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఎక్కడ తయారైందో తెలుసా..?
x
Highlights

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ట్రైన్‌ 18కు పేరు పెట్టింది కేంద్రం. ఈ రైలును వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా పిలవనున్నట్టు...

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ట్రైన్‌ 18కు పేరు పెట్టింది కేంద్రం. ఈ రైలును వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా పిలవనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలోనే ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ రైలు ఢిల్లీ-వారణాసి మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు. 16 కోచ్‌లు కలిగిన ఈ ట్రైన్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. పూర్తి ఏసీ(ఎయిర్‌ కండీషన్డ్‌) సదుపాయం ఉన్న ఈ రైలు కాన్పూర్‌, అలహాబాద్‌లో మాత్రమే ఆగుతుందని పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

కాగా ట్రైన్‌ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజాభిప్రాయ సేకరణ కోరగా, వేల సంఖ్యలో పేర్లు వచ్చాయి. చివరకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసినట్టు చెప్పారాయన. 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు అందిస్తున్న బహుమతి ఇదని చెప్పారు. ఇక ఈ ట్రైన్‌లో ప్రయాణ ఛార్జీలు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ఛార్జీలు 2 వేల 800 రూపాయల నుంచి 2 వేల 900 రూపాయల మధ్య ఉండగా.. చైర్‌ కార్‌ 1600 నుంచి 1700 రూపాయలు ఉంటుందని సమాచారం

Show Full Article
Print Article
Next Story
More Stories