Jallikattu: తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. విషాదం

Jallikattu: తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. విషాదం
x
జల్లికట్టు
Highlights

సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు కొనసాగుతున్నాయి. జల్లికట్టు క్రీడకు కేంద్రబిందువుగా ఉన్న మధురై ఏరియాలో అధికారుల పర్యవేక్షణలో,...

సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు కొనసాగుతున్నాయి. జల్లికట్టు క్రీడకు కేంద్రబిందువుగా ఉన్న మధురై ఏరియాలో అధికారుల పర్యవేక్షణలో, పటిష్ట భద్రత నడుమ పోటీలు జరుగుతున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో హాజరైన యువత కేరింతల మధ్య పోటీదారులు ఎద్దుల్ని లొంగదీసుకునే ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది.

ఈసారి పోటీల్లో మొత్తం 2వేల ఎద్దులకు మాత్రమే అనుమతిచ్చారు. అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులు బరిలోకి దిగనున్నాయి. జల్లికట్టులో పాల్గొనే పోటీదారులకు సంబంధించి అధికారులు కచ్చితమైన నిబంధనల్ని రూపొందించారు. పోటీదారులు 75 మందిని కలిపి ఒక్కో జట్టుగా విభజించారు. ఒక జట్టు కేవలం 60 ఎద్దులతో మాత్రమే తలపడాల్సిఉంటుంది. ప్రేక్షకులకు, పోటీదారులకు మధ్య పటిష్టమైన బారికేడ్లను నిర్మించారు. గాయపడ్డవారికి చికిత్స అందించడానికి 20 అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు.

ఐతే పలుచోట్ల ఎద్దులతో తలపడే గ్రామంలో యువకులకు గాయాలవుతున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి సురయార్‌లో జరిగిన జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఎద్దులు జనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించాయి. పోటీలు చూసేందుకు వచ్చిన మహాలక్ష్మీ అనే మహిళ ఎద్దుల దాడిలో చనిపోయింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories