Top
logo

ఇదో వింత : ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని ఫైన్

ఇదో వింత : ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని ఫైన్
Highlights

కొత్త ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులను చుక్కులు చూపిస్తున్నాయి. ఏం చేస్తే దేనికి ఫైన్ వేస్తారో ఎవరికీ అర్ధం...

కొత్త ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులను చుక్కులు చూపిస్తున్నాయి. ఏం చేస్తే దేనికి ఫైన్ వేస్తారో ఎవరికీ అర్ధం కావడం లేదు. చెప్పులు వేసుకొని బైక్ నడిపితే కూడా ఫైన్ వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విషయం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని గఢ్ ముక్తేశ్వర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ దేవేంద్ర కుమార్‌కు 2019, జులై 03వ తేదీ చలానా అందింది. ఎందుకు చలానా వేసారు అని తెలుసుకోగా అందులో హెల్మెట్ లేనందున మరియు లైసెన్స్ లేనందున అని తెలిసింది. దీనికి గాను మూడువేల రూపాయలను చెల్లించాలని తెలిపారు. దీనిపై ట్రాఫిక్ ఇన్ చార్జీ అజయ్ వీర్ సింగ్ స్పందించారు. చలానా విధించే క్రమంలో తప్పులు జరిగాయని , టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది జరిగిందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన చలానాను రద్దు చేసినట్లు అయన స్పష్టం చేసారు.

Next Story