మనిషి శరీరంలోకి విష రసాయనాలు..

మనిషి శరీరంలోకి విష రసాయనాలు..
x
Plastic
Highlights

ప్లాస్టిక్ భూతం మనిషి నిత్యం వాడే వస్తువులలో ఒక భాగంగా మారింది. ఇండ్లలో పెళ్లిళ్లు జరిగినా, ఏమైనా చిన్పపాటి ఫంక్షన్లు జరిగినా ఈ ప్లాస్టిక్ వస్తువులనే ఎక్కువగా వాడతారు.

ప్లాస్టిక్ భూతం మనిషి నిత్యం వాడే వస్తువులలో ఒక భాగంగా మారింది. ఇండ్లలో పెళ్లిళ్లు జరిగినా, ఏమైనా చిన్పపాటి ఫంక్షన్లు జరిగినా ఈ ప్లాస్టిక్ వస్తువులనే ఎక్కువగా వాడతారు. డెకరేషన్ దగ్గర నుంచి భోజనాల వరకూ అంతా ప్లాస్టిక్ నే వాడుతున్నారు. అంతే కాకుండా మన నిత్య జీవితంలో నీళ్లు తాగడం నుంచి, ఇంటికి ఏమైనా వస్తువులను పట్టుకెళ్లాలంటే కూడా ఈ ప్లాస్టిక్ నే వాడతారు. ఈ ప్లాస్టిక్ ని వాడి పడేసిన తరువాత ఎన్ని ఏండ్లు గడిచినా అది భూమిలో కరగకుండా అలాగే ఉంటుంది. దీంతో పర్యావరణం కాలుష్యం పెరిగిపోతుంది. అంతే కాకుండా మనుషులకు కూడా చాలా రకాల అనారోగ్యాలు సంభవిస్తాయి.

ఈ విషయాలన్నిటిపై ఇటీవల కొంత మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశోధనలు చేసారు. పరిశోధనల అనంతరం మనిషి జీవితంపై ప్లాస్టిక్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అన్న మరో విషయాన్ని గుర్తించారు. ఈ ప్లాస్టిక్‌ ద్వారా మనిషి తెలియకుండానే బీపీఏ అనే రసాయనం మనిషి శరీరంలోకి వెళ్తోందని అమెరికా పరిశోధకులు తేల్చారు.

ఈ పరిశోధనల్లో భాగంగా కొంత మంది మూత్ర నమూనాలపై పరీక్షలు జరిపిన పరిశోధకులు ప్లాస్టిక్ ను అధికంగా వాడడంతో సాధారణం కంటే 44 రెట్లు ఎక్కువ బీపీఏ ఉన్నట్లు గుర్తించారు. బీపీఏ మనిషి శరీరంలో ఉండవలసిన దాని కంటే ఎక్కువగా ఉంటే అది సంతానోత్పత్తి, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని ఈ పరిశోధన ద్వారా స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories