Top
logo

నేడు పీవీ నరసింహారావు 98 జయంతి ...

నేడు పీవీ నరసింహారావు 98 జయంతి ...
X
Highlights

భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసినా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి 98 జయంతి ...

భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసినా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి 98 జయంతి నేడు.. అయన 1921 జూన్ 28 న ఉమ్మడి వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో జన్మించారు .. అయన అసలు పేరు పాములపర్తి వేంకట నరసింహారావు.. నాగపూరు విశ్వవిద్యాలయంలో 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివారు . ఇక తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు .

రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ;

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీధి ఒక ప్రత్యేక స్థానమనే చెప్పాలి . అయన 1957 లో మంథని నియోజక వర్గం నుండి మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు . ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు . 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.

ముఖ్యమంత్రిగా ఎంపీక :

ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేదు . పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు కూడా లేరు. అయిన రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది మరి .. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి..

ప్రధానమంత్రిగా చెరగని ముద్ర :

ప్రధానమంత్రి పదవి ఆయనని అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో అయన పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉపఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే కావడం విశేషం .. ఇక ఎన్ని గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రధానిగా చెరగని ముద్ర వేసారు పీవీ ..

సాహిత్యం ;

పీవీ నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక మొత్తం 17 భాషలు ఆయనకు వచ్చు .. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలును ఆయన హిందీలోకి అనువాదం చేసారు . దీనికి గాను పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది...

మరణం :

పీవీ నరసింహారావు 2004, డిసెంబర్ 23 న కన్నుమూసారు.

మోడి నివాళి ..

పీవీ నరసింహారావు 98 జయంతి సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి మోడీ ఆయనకి నివాళులు అర్పించారు .. కష్టకాలంలో ఉన్న దేశాన్ని సమర్దవంతంగా నడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ..

Next Story