టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ : పసికందులను ఎగరేస్తూ..

టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ : పసికందులను ఎగరేస్తూ..
x
Highlights

ప్రస్తుతం సోషల్ సైట్స్ లో ప్రతిఒక్కరిని ఆకట్టుకునే ఆప్ టిక్ టాక్. ఒక పాటకో, డైలాగ్‌కు పెదవులు కదిపి మూమెంట్‌ ఇచ్చి, హావభావాలు ఒలికించి వీడియోలు...

ప్రస్తుతం సోషల్ సైట్స్ లో ప్రతిఒక్కరిని ఆకట్టుకునే ఆప్ టిక్ టాక్. ఒక పాటకో, డైలాగ్‌కు పెదవులు కదిపి మూమెంట్‌ ఇచ్చి, హావభావాలు ఒలికించి వీడియోలు తీసుకుంటున్నారు. అయితే చిన్న పెద్ద అని తెడ లేకుండా ప్రతి ఒక్కరు టిక్ టాక్ బానిసలైపోతున్నారు. ఇక టిక్ టాక్ వీడియోలకు సంబంధించి ఎంత చెప్పుకున్న తక్కువే అనుకొండి. అయితే టిక్ టాక్ వెర్రి రోజు రోజుకు మరింత ముదిరిపోతుంది. తాజాగా ఒడిశాలోని ఓ ఆసుపత్రిలో నర్సులు చేసిన టిక్ టాక్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే నర్సులు పసిపిల్లల వార్డులో విధులకే కేటాయించారు అధికారులు. అయితే చేయాల్సిన పనులు చేయకుండా చేయకుండా ఆసుపత్రిలో టిక్ చేస్తూ బాలీవడ్ పాటలకు పదం కదుపుతూ పసిబిడ్డలను ఎత్తుకుని ముద్దు పెడుతూ, ఫన్నీ డైలాగులు చెబుతూ టిక్‌టాక్‌లో వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్‌ చేశారు.

ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షేర్స్, కామెంట్లు వస్తుండటంతో తెగ సంబురపడిపోయారు నర్సులు. కానీ అదే వీడియో వారి కొలువులకే ఎసరు పెడుతుందని వారు ఉహించలేదు. ఈ వీడియో కాస్తా జిల్లా ముఖ్య వైద్య అధికారి (సిడిఎంఓ) కంటపడింది. ఇక ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి ఈ విషయంపై దర్యప్తుకు ఆదేశించారు. అలాగే సదరు నర్పులకు షోకాజ్ నోటిసులు కూడా జారీ చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పిస్తున్నమని ఆసుపత్రి ఇన్ చార్జ్ తపన్ కుమార్ వెల్లడించారు. ఇక ఈ దర్యాప్తు తరువాత అవసరమైతే సదరు నర్సులను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories