ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళిన మహిళ .. మేమే భర్త అంటూ ముగ్గురు వ్యక్తులు హంగామా..

ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళిన మహిళ .. మేమే భర్త అంటూ ముగ్గురు వ్యక్తులు హంగామా..
x
Highlights

21ఏళ్ల ఓ మహిళా శనివారం సాయింత్రం ప్రసవం కోసం తన తల్లితో పాటు మరో వ్యక్తితో కలిసి ఆసుపత్రికి వెళ్ళింది . ఆమెతో వచ్చిన ఓ వ్యక్తి ఆమె తన భర్త అంటూ...

21ఏళ్ల ఓ మహిళా శనివారం సాయింత్రం ప్రసవం కోసం తన తల్లితో పాటు మరో వ్యక్తితో కలిసి ఆసుపత్రికి వెళ్ళింది . ఆమెతో వచ్చిన ఓ వ్యక్తి ఆమె తన భర్త అంటూ దరఖాస్తులు నింపి అడ్వాన్స్ కూడా పే చేసాడు . ఆదివారం ఆమె ప్రసవం కోసం ఆసుపత్రి సిబ్బంది ఆమెను ఆపరేషన్ దియేటర్లోకి తీసుకువెళ్ళారు . ఇంతలో మరో వ్యక్తి వచ్చి ఆమె భర్తనని చెప్పుకొచ్చాడు . దీనితో మొదటివ్యక్తికి మరియు రెండవ వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది .

దీనితో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చారు . ఇరువురిని మ్యారేజ్ సర్టిఫికెట్స్ తీసుకురావాలని కోరారు . ఇందులో రెండవ వ్యక్తి మ్యారేజ్ సర్టిఫికెట్స్ తీసుకువచ్చాడు . దీనితో మొదటి వ్యక్తి నేను తన భర్తని కాదని , తన స్నేహితుడని ఒప్పుకున్నాడు . ఇంతలో మరో ట్విస్ట్ పోలీసులకు ఏర్పడింది .

పుట్టిన బిడ్డకు నేనే తండ్రి అని కానీ ఆమెకు భర్తని కాదని మరో వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు . దీనితో ఎం చేయాలో తెలియక పోలీసులు ఆమె పేషెంట్ స్పృహలోకి వచ్చే వరకు ఎదురు చూసారు . మ్యారేజి సర్టిఫికెట్ తీసుకొచ్చిన రెండో వ్యక్తే తన భర్త అనీ.. తనకు పుట్టిన బిడ్డకు కూడా అతడే తండ్రి అని ఆమె చెప్పడంతో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడింది.ఈ ఘటన కలకత్తాలో చోటు చేసుకుంది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories