ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఖాతాదారులపై ఎఫెక్ట్.!

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఖాతాదారులపై ఎఫెక్ట్.!
x
Highlights

బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకుగా పేరుపొందిన ఎస్‌బీఐ ఖాతాదారులకు సంతృప్తి కర సేవలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. అంతే కాదు తన కస్టమర్ల కోసం...

బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకుగా పేరుపొందిన ఎస్‌బీఐ ఖాతాదారులకు సంతృప్తి కర సేవలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. అంతే కాదు తన కస్టమర్ల కోసం డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రా, లోన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా ఎన్నో సేవలను ఆఫర్ చేస్తోంది. దీంతో స్టేట్ బ్యాంకు కస్టమర్లు ఎంతో సంతృప్తి చెందుతున్నారు. ఎన్నో సేవలను అందిస్తున్న ఈ బ్యాంక్ నూతన సంవత్సరం సందర్భంగా మూడు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక ఈ నిర్ణయాలు జనవరి1, 2020 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లకుపై కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డబ్బు డ్రా చేయాలంటే ఓటీపీ:

నిన్నటి వరకూ డబ్బులను ఏటీఎంలో డ్రా చేయడం సులభంగా ఉండేది. కానీ బ్యాంకు తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం రూ.10,000కు పైన అమౌంట్ డ్రా చేయాలనుకుంటే కచ్చితంగా ఓటీపీ రావాల్సిందే. ఎస్‌బీఐ ఏటీఎం నెట్‌వర్క్‌కు అంతటికీ ఓటీపీ విధానం అమలులోకి రానుంది. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తే.. అప్పుడు బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే డబ్బులు తీసుకోవడానికి వీలవుతుంది. దీంతో మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టొచ్చని బ్యాంక్ భావిస్తోంది.

తగ్గనున్న ఈఎంఐ:

ఈ ఏడాది ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌ రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని బ్యాంక్ తెలిపింది. కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వారు 7.9 శాతం వడ్డీ రేటుకే రుణాలు పొందొచ్చని తెలిపింది. అంతే కాదు ఎంఎస్ఎంఈ రుణాలకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. ఈ నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందని తెలిపారు. ఆర్‌బీఐ డిసెంబర్ మానిటరీ పాలసీ తర్వాత ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటు తగ్గించిన ఒకే ఒక బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచింది.

కొత్త ఏటీఎం సర్వీసులు:

ఏటీఎం మోసాలను అరికట్టేందుకు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత క్యాష్ విత్‌డ్రా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పద్ధతి ద్వారా ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ఏటీఎంలో చేసుకునే లావాదేవీలు సురక్షితం కానున్నాయి. అంతేకాదు ఇప్పటివరకూ అమలులో ఉన్న పాత మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డులు తీసుకోవాలని ఖాతాదారులకు సందేశాలు పంపుతూనే ఉంది. దీని గడువు 31కి ముగిసినందున పాత డెబిట్ కార్డుల సర్వీసులను రద్దు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories