దొంగతనానికి వచ్చి దొంగతనం చేయకుండానే వెళ్ళిపోయాడు.. ఎందుకంటే?

దొంగతనానికి వచ్చి దొంగతనం చేయకుండానే వెళ్ళిపోయాడు.. ఎందుకంటే?
x
Highlights

దొంగలకి కూడా కొన్ని నీతి, నియమాలు ఉంటాయని ఈ వార్త చదివాకా మీకే అర్ధం అవుతుంది. అవును దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్న ఓ దొంగ ఎవరు లేని ఓ ఇంటికి దొంగతనానికి వచ్చి దొంగతనం చేయకుండా వెళ్ళిపోయాడు.

దొంగలకి కూడా కొన్ని నీతి, నియమాలు ఉంటాయని ఈ వార్త చదివాకా మీకే అర్ధం అవుతుంది. అవును దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్న ఓ దొంగ ఎవరు లేని ఓ ఇంటికి దొంగతనానికి వచ్చి దొంగతనం చేయకుండా వెళ్ళిపోయాడు.. అతను ఎందుకు అలా వెళ్ళిపోయాడో తెలిస్తే షాక్ అవకుండా ఉండలేం.. ! కేరళకు చెందిన సదరు దొంగ ఐదు షాపుల్లో దొంగతనం చేసి ఆరో దొంగతనానని సిద్దం అయ్యాడు. కానీ ఆ ఇంట్లో ఆర్మీ క్యాప్ కనిపించడంతో అది ఓ మాజీ సైనికుడి ఇల్లు అని గుర్తుంచి తన మనసు మార్చుకున్నాడు.

ఇంటికి దొంగతనానికి వచ్చినందుకు క్షమాపనులు కోరుతూ... ఆ ఇంటి యజమాని, మాజీ సైనికుడైన ఐజాక్ మణికి లేఖ రాశాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లా తిరువంకుళంలో చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం ఆ ఇంట్లోని వారంతా బహ్రెయిన్ వెళ్లారు. కానీ రోజూ ఆ ఇంటికి పనిమనిషి వచ్చి ఇంటిని శుభ్రం చేసి వెళ్తుంది. ఈ క్రమంలో ఓ రోజు పనిమనిషి ఇంటి తలుపు తీసి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఆ ఇంటికి చేరుకొని పరిశీలించగా అక్కడ ఒక్క వస్తువు కూడా పోలేదు. కానీ గోడమీద ఒక మార్కర్ ఉపయోగించి గోడపై మలయాళంలో దొంగ రాసిన సందేశం ఉంది. 'నేను బైబిల్ యొక్క ఏడవ ఆజ్ఞను (నీవు దొంగిలించకూడదు) ఉల్లంఘించాను. ఇది ఒక సైనికుడి ఇల్లు అని నాకు తెలియదు. నేను ఆర్మీ టోపీని గుర్తించినప్పుడు చివరి నిమిషంలో దానిని నేను గ్రహించాను. ఆఫీసర్, దయచేసి నన్ను క్షమించు. ఇది ఒక సైనికుడి ఇల్లు అని నాకు తెలిసి ఉంటే, నేను లోపలికి వచ్చేవాడిని కాదు'' అంటూ రాశాడు. ప్రస్తుతం పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనికంటే ముందు ఆ దొంగ అదే రాత్రి సమీప ప్రాంతంలోని ఐదు దుకాణాల్లోకి చొరబడ్డాడని పోలీసులు తెలిపారు. ఓ టైర్ల షాపులో చోరీ చేసిన క్యాష్ బ్యాగ్, మరో పర్సు సైనికుడి ఇంట్లో లభ్యమయ్యాయి. అయితే అందులో నుంచి రూ .10,000 మొత్తం దొంగిలించి తిరిగి బ్యాగ్‌ను యజమానికి ఇవ్వమని దొంగ పోలీసులను కోరాడు.. . ఫోరెన్సిక్ బృందం దొంగ వేలిముద్రల కోసం ఇంటిని స్వీప్ చేశారు పోలీసులు . ఇందులో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చాత్తాపం చెందిన దొంగ స్థానికుడు కాదని, గోడపై క్షమాపణ చెప్పడం పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించే చర్య అని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories