నిర్భయ నిందితులను ఉరి తీసింది ఇతడే!.. ఇంతకి ఎవరీతను?

నిర్భయ నిందితులను ఉరి తీసింది ఇతడే!.. ఇంతకి ఎవరీతను?
x
Pawan Jallad
Highlights

సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులు అయిన అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ సింగ్‌లను ఈ రోజు ఉరి తీసిన విషయం తెలిసిందే.

సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులు అయిన అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ సింగ్‌లను ఈ రోజు ఉరి తీసిన విషయం తెలిసిందే..ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలు నెంబర్ 3లో ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్ష పడటం కూడా దేశంలో ఇదే మొదటిసారి.. గత ఎనమిదెళ్ళ నుంచి నుండి ఇప్పటివరకూ నిర్భయ కేసులో నిందితులు ఉరి నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ చివరికి న్యాయమే గెలిచింది.

అయితే ఈ నలుగురు నిందితులను ఉత్తర‌ప్రదేశ్‌లోని మీర‌ట్‌కు చెందిన తలారీ పవన్‌ జల్లాడ్‌ అనే వ్యక్తి తీహార్ జైలులో వారిని ఉరి తీశారు. అయితే, వీరిని ఉరి తీసేందుకు పవన్ జల్లాడ్‌నే అధికారులు ఎందుకు నియమించారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకి ఎవరు పవన్‌ జల్లాడ్‌ అని నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు..

అందుతున్న సమాచారం ప్రకారం ఉరి తీయ‌డంలో పవన్ జల్లాడ్‌ ఓ స్పెష‌లిస్టు. అయితే ఇది వారి కుటుంబం తరతరాలుగా ఇదే పని చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి మూడు త‌రాల‌కు చెందిన వారు ఆ వృత్తిలోనే కొనసాగారు. తర్వాత పవన్ జల్లాడ్‌ కూడా ఇదే వృత్తిని ఎంచుకున్నాడు. అతను ఉరి తీస్తే అందులో ఎటువంటి పొర‌పాటు ఉండ‌దని జైలు అధికారులకు గట్టి నమ్మకం ఉంటుందట!

ఇక ప‌వ‌న్‌ జల్లాడ్‌ కుటుంబ విషయానికి వస్తే అతనికి ఓ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని చిన్న కుమారుడు కూడా ఇదే వృత్తిని ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం. ఇక నిర్భయ దోషుల్లో ఒక్కో దోషిని ఉరి తీసినందుకు పవన్‌ జల్లాడ్‌ కు రూ.20 వేలు ఫీజు రూపంలో అందుతుందని జైలు అధికారులు తెలిపారు. తలారీలకు నెలవారి జీతం ఉండదని, కేవలం నెలకు రూ.3 వేల చొప్పున స్టైఫండ్ మాత్రమే ఉంటుందని పవన్ జల్లాడ్ ఓ జాతీయ పత్రికకి వివరించారు.

నిర్భయ తల్లిదండ్రుల ఆనందం :

ఇక నిందితులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవీ, భద్రినాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తన కుమార్తెకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయం వైపే కోర్టులు నిలబడ్డాయని, ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలని న్యాయపోరాటం చేస్తానని నిర్భయ తల్లి వెల్లడించారు. ఇక నుంచి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది తండ్రి భద్రినాథ్ సింగ్ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories