కనుమరుగు కానున్న కార్గిల్‌ యుద్ధ విమానం

కనుమరుగు కానున్న కార్గిల్‌ యుద్ధ విమానం
x
Highlights

యుద్దాల్లో సైనికులతో పాటు వైమానిక దళం కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి.

యుద్దాల్లో సైనికులతో పాటు వైమానిక దళం కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈ యుద్ధవిమానాల్లో ఇప్పటి వరకూ మిగ్ విమానాలు తనదైన శైలిలో ప్రధాన పాత్రనే పోషిస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా మిగ్-27 దేశానికి ఎన్నో సేవలను అందించింది. నాలుగు దశాబ్దాలు అంటే 38 ఏళ్లపాటు వైమానిక దళంలో కీలక పాత్ర పోషించిన ఈ మిగ్-27 యుద్ధ విమానాలు కనుమరుగు కానున్నాయి. 1999 నాడు జరిగిన కార్గిల్‌ యుద్ధం సందర్భంగా ఆపరేషన్ సేఫ్‌డ్ సాగర్‌లో ఈ విమానాలు కీలకంగా వ్యవహరించాయి. అయినప్పటికీ వీటికి వీడుకోలు పలికే సమయం రావడంతో వాయుసేన శుక్రవారం మిగ్-27కు వీడ్కోలు పలకనుంది.

జోధ్‌పూర్‌లో 29వ స్వ్కాడ్రన్‌కు చెందిన సిబ్బంది మిగ్ 27 బహదూర్‌ను చివరిసారిగా నడపనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం అందించాయి. ఈ చివరి ఘట్టం ముగిసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడనుంది. చివరిసారిగా ఆకాశంలో విహరించే ఈ విమానాలను చూడానికి ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా సహా పలువురు హాజరుకానున్నారు.

ఇటీవల కాలంలో ఈ యుద్ధ విమానాల పనితీరు అధికారులను అంతగా సంతృప్తి పరచడం లేదని తెలుస్తుంది. మిగ్ -27 విమానాలు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఇకపై రష్యా నుంచి ఎలాంటి యుద్ధ విమానాలు కొనుగోలు చేయవద్దని, రష్యా నుంచి దిగుమతి చేసిన మిగ్‌లు సరిగా పని చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర సమయంలో ఇప్పటివరకూ చాలా యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయని అధికారుల చెపుతున్నారు.

ఈ విమానాలను 1981లో నాటి సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేశారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మొత్తం 167 విమానాలను రూపొందించారు. తర్వాత 80 విమానాలను అధునీకరించారు. మిగ్ యుద్ధ విమానాలకు 4000 కిలోల బరువైన పేలోడ్లను తీసుకెళ్లే సామర్థ్యం కలది. ఇది గంటలకు 1,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

కానీ ప్రస్తుతం వాటిలో కొన్ని సాంకేతిక లోపాలు రావడంతో ఈ యుద్ధ విమానాలను వైమానిక దళం నుంచి దశలవారిగా తొలగిస్తున్నారు. మూడేళ్ల కిందట పశ్చిమ బెంగాల్‌లోని హసీమారాలో రెండింటిని తొలగించారు. గత ఏడాది డిసెంబరులో జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి కూడా తొలగించారు. ఇక భవిష్యత్తులో ఈ విమానాల గురించి తెలుసుకోవాలంటే చరిత్రను తిరగేయాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories