పటియాలా హౌస్ కోర్టు వద్ద హైడ్రామా.. బతకాలని లేదు.. నేను చచ్చిపోతా

పటియాలా హౌస్ కోర్టు వద్ద హైడ్రామా.. బతకాలని లేదు.. నేను చచ్చిపోతా
x
Highlights

రేపు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. తమ ఉరిశిక్ష నిలిపివేసేందుకు స్టే ఇవ్వాలని కోరిన దోషుల పిటిషన్ ను పటియాల కోర్టు కొట్టివేసింది. దీంతో ముందు...

రేపు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. తమ ఉరిశిక్ష నిలిపివేసేందుకు స్టే ఇవ్వాలని కోరిన దోషుల పిటిషన్ ను పటియాల కోర్టు కొట్టివేసింది. దీంతో ముందు ప్రకటించన ప్రకారమే నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరో కొన్ని గంటల్లో వారిని ఉరితీసేందుకు తీహార్‌ జైలు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పటియాలా హౌజ్‌ కోర్టు వద్ద గురువారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దోషుల పిటిషన్లపై వాదోపవాదాలు జరుగుతున్న వేళ దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ భార్య పునీతా దేవి అక్కడికి చేరుకొని కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను తన పక్కనే కూర్చోబెట్టుకున్న ఆమె చెప్పులతో తన ముఖంపై కొట్టుకుంటూ బిగ్గరగా ఏడ్చారు. ఈ క్రమంలో స్పృహ తప్పిపడిపోయారు. స్పృహ లోకి వఛ్చిన తరువాత మళ్లీ అదే విధంగా చెప్పులతో తనను తాను కొట్టుకుంటూ తనకు బతకాలని లేదని, ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. శిక్ష అమలైతే నేను చచ్చిపోతా'' అంటూ బెదిరింపులకు దిగారు. కాగా అక్షయ్ భార్య ఇదివరకే తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. '' నా భర్త అమాయకుడు. ఆయనను ఉరి తీసేముందు నాకు చట్టపరంగా విడాకులు కావాలి. ఎందుకంటే నేను అత్యాచార దోషి భార్యగా ఉండాలనుకోవడం లేదు'' అని ఔరంగాబాద్‌ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories