కేంద్రం త్వరలోనే FTA యుటిలైజేషన్‌ మిషన్‌ను ప్రారంభించనుంది - నిర్మలా

కేంద్రం త్వరలోనే FTA యుటిలైజేషన్‌ మిషన్‌ను ప్రారంభించనుంది - నిర్మలా
x
Highlights

దేశంలో ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలో ఆమె మీడియాతో...

దేశంలో ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2019-20 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు. ఎగుమతులపై పన్ను విషయంలో పునరాలోచించాం. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆమె స్పష్టం చేశారు. క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌తో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నానని చెప్పారు. బ్యాంకింగ్‌ రంగంలో కీలక రేట్లు తగ్గింపుతో సానుకూల ఫలితాలు వస్తాయి. ద్రవ్యోల్బణం 4 శాతం లోపు ఉందన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి.

చిన్నమొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన చర్యలు ఉండవు. ఐటీ రిటర్న్స్‌లో జరిగే చిన్న చిన్న పొరపాట్లకు గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవు. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో భారత్‌ స్థానం మెరుగైంది, భవిష్యత్‌లో ఇంకా ముందుకు వెళ్తాం. 2014లో భారత్‌ ర్యాంకు 142 ఉంటే.. 2018లో 77వ ర్యాంక్‌కు చేరుకుందని తెలిపారు. ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా కొత్త పథకం ఎంఈఐఎస్‌ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఎంఈఐఎస్‌ పథకం అమలుతో రూ. 50 వేల కోట్ల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఎంఈఐఎస్‌ పథకాన్ని 2020, జనవరి 1వ తేదీన అమల్లోకి వస్తుంది. ఈ పథకం వల్ల టెక్స్‌టైల్‌ రంగాలతో పాటు ఇతర రంగాలకు ప్రయోజనం కలుగుతుంది. పాత పథకం ఆర్‌వోడీటీఈఎస్‌ కూడా డిసెంబర్‌ వరకు కొనసాగుతుంది. పన్ను చెల్లింపుల్లో ఇ-అసెస్‌మెంట్‌ అనే విధానాన్ని అమలు చేస్తాం. వచ్చే మార్చిలో మెగా షాపింగ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తాం అని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories