పెళ్లి కావాలంటే...ఆ ఊర్లో ఓ వింత ఆచారం

పెళ్లి కావాలంటే...ఆ ఊర్లో ఓ వింత ఆచారం
x
Highlights

గుజరాత్ లోని ఒక గ్రామంలో పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు ముక్కు వాసన్ చూసే ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు.

సాధారణంగా పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళితే ఎవరైనా పెళ్లి కొడుకు గుణగనాలు, చదువు, ఉద్యోగం, ఆస్తి, కుటుంబం గురించి వివరాలు తెలుసుకుంటారు. మద్యం అలవాటు ఉందని తెలిసినా ఈ కాలంలో ఇదంతా మామూలే అని అనుకుంటాం. ఇవన్నీ అమ్మాయికి, పెద్దవారికి నచ్చితే పెళ్లి చేసుకుంటారు. కానీ గుజరాత్ లోని ఓ గ్రామంలో ఆచారం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది.

గుజరాత్ లోని కలోల్ తాలూకాలోని ' పియాజ్ ' అనే గ్రామంలో సుమారు 6 వేలు మంది వుంటారు. వీరిలో ఎక్కువగా ఠాకూర్లు ఉంటారు. వారి ఉల్లో ఎవరైనా అమ్మాయికి పెళ్లి కుదిరిందంటే చాలు ఆ పెళ్లి కొడుకు ముక్కుని, నోటిని వాసన చూస్తారు వధువు తరుపువాళ్ళు. అంతే కాదు పెళ్లి కొడుకు తండ్రి, అతని కుటుంబంలో ఉన్న మగవాళ్ళ అందరి ముక్కు, నోరు వాసన చూస్తారంట. నిశ్చితార్థ సమయంలోనే కాదు, పెళ్లికి ముందు కూడా ఈ పరీక్ష వరుడు, అతని కుటుంబ సభ్యలు ఎదురుకోవాల్సిందే. ఒక వేల ఈ పరీక్షలో పెళ్ళికొడుకు మందు కొట్టాడని తెలిస్తే ఆ పెళ్లిని ఆపెస్తారంట. అంతేకాదు మద్యం తాగే అలవాటున్న భర్త వల్ల మహిళ కాపురం కూలిపోతే అతని కుటుంబం ఆ మహిళకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలంట.

ఇంతకముందు ఎక్కడా లేని ఈ ఆచారం నాలుగేళ్ల కిందటే ఈ గ్రామంలో మొదలైంది. ఈ ఆచారం మొదలవడానికి కారణం ఆ ఉళ్ళో మద్యం తాగి 20 ఏళ్ళ లోపు యువకుల్లో దాదాపు 15 మంది చనిపోయారంట. మద్యం తాగే భర్తల కారణంగా అనేక మంది మహిళల కాపురాలు నాశనమైన పోయాయని, దానికి చెక్ పెట్టేందుకే ఈ సంప్రదాయాన్ని అమల్లోకి తెచ్చామని ఆ ఊరి పెద్ద చెబుతున్నాడు.

ఈ ఆచారం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ ఉళ్లో ఇప్పటి వరకు ఎవరు తాగుడుకు బానిసై ఎవరు చనిపోలేదని. ఆ ఉరి పెద్దమనుసులు చెపుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories