logo

కశ్మీర్‌లో ఉగ్రదాడి : ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి

కశ్మీర్‌లో ఉగ్రదాడి : ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి
Highlights

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్ గస్తీ...

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్ గస్తీ బృందంపై బుధవారం సాయంత్రం విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించగా,పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. గాయపడిన వారిలో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ ఎస్‌హెచ్‌ఓ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌, స్ధానిక మహిళ ఒకరు ఉన్నారని అధికారులు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top