దాదాపుగా అన్నీ తెరుచుకుంటున్నాయి.. జర భద్రం!

దాదాపుగా అన్నీ తెరుచుకుంటున్నాయి.. జర భద్రం!
x
Highlights

కరోనా రక్కసి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని దాదాపుగా 80 రోజుల పాటు అన్నిటినీ లాక్ చేసేశారు.

కరోనా రక్కసి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని దాదాపుగా 80 రోజుల పాటు అన్నిటినీ లాక్ చేసేశారు.కొద్ది రోజులుగా కొన్ని వెసులుబాట్లు తీసుకుంటూ సాధారణ జీవనానికి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించాయి ప్రభుత్వాలు. తాజాగా ఈరోజు నుంచి దాదాపుగా అన్ని కార్యకలాపాలూ యధావిధిగా కొనసాగానున్నాయి. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యతా, అవసరం మనమీద ఉండనే విషయాన్ని మర్చిపోకూడని పరిస్థితి ఇది.

అవి తప్ప అన్నీ..

సినిమా హాళ్ళు..బార్లు..విద్యాసంస్థలు.. ఇవి తప్ప మిగిలిన అన్నీ ఈరోజు నుంచి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే దేవాలయాలలో దర్శనాల కోసం ఏర్పాట్లు పూర్తీ చేశారు. షాపింగ్ మాల్స్ ఈరోజు నుంచి తెరచుకుంటాయి. అయితే, నిబంధనలు పాటించడం అన్ని చోట్లా తప్పనిసరి. నిబంధనల ఉల్లంఘనలను ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుంటాయి. రెస్టారెంట్లు, హోటళ్ళు పూర్తి స్థాయిలో తెరచుకుంటాయి. ఇన్నాళ్ళూ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినవి అన్ని జనసమ్మర్దం పెద్దగా ఉండని ప్రాంతాలు. ఈరోజు తెరచుకోనున్నవి అన్నీ సమూహాలుగా ప్రజలు తిరిగే ప్రాంతాలు.. దేవాలయాలు, హోటల్లు, రెస్టారెంట్లు ఇవన్నీ ప్రజలు ఎక్కువగా మరీ ముఖ్యంగా గుంపులుగా చేరే ప్రాంతాలు. అందుకే ఈరోజు నుంచి వస్తున్న సడలింపులు కీలకమైనవిగా భావించవచ్చు.

కరోనా కట్టడి ఎలా..

లాక్ డౌన్.. ఆంక్షలు.. సడలింపులు..ఇలా ప్రభుత్వాలు చేయాల్సినవి అన్నీ చేస్తున్నాయి. కరోనా మాత్రం తానూ చేయాలనుకున్నది చేస్తూనే పోతోంది. 3 దశల లాక్ డౌన్ ల తరువాత.. 4 వ లాక్ డౌన్ సడలింపులతో కొనసాగుతోంది. ఒక్కొటిగా అన్నిటికీ సడలింపులు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఈ దశలోనే కరోనా మరింత కలవర పెడుతుండటం ఆందోళన కలిగించే అంశం. నిబంధనల సడలింపు కేవలం సామాన్య ప్రజానీకం ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఉండేందుకే. ప్రమాదం పూర్తిగా కాదు అసలు పక్కకి పోలేదు. మన మధ్యే పొంచి ఉంది కరోనా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మనల్ని కబళిస్తుంది. ఈ విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమైనది. స్వీయ నియంత్రణ..స్వీయ క్రమశిక్షణ వంటివి చాలా ముఖ్యమైనవి. దాదాపుగా అందరికీ తెలిసిన విషయాలే అయినా మరోసారి కొన్ని జాగ్రత్తలు ఈ సందర్భంగా..

- సమూహాలుగా.. గుంపులుగా అసలు ఉండొద్దు..

- భౌతిక దూరం అన్నిటికీ శ్రేయస్కరం అని గుర్తుంచుకోవాలి

- మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మన జీవితంలో ఇక మాస్క్ ఒక భాగం అనే విషయాన్ని ఆమోదించండి. ఎట్టి పరిస్థితిలోనూ మాస్క్ లేకుండా గడప దాటవద్దు.

- శానిటైజర్ కూడా తప్పనిసరిగా కూడా ఉంచుకోవాలి.

- ఇక ఆలయాలు తెరిచారు దేవుడ్ని చూసేయాలనే ఆరాటం..భక్తీ అందరికీ ఉండడం సహజం. కానీ, దేవుని దగ్గరకు వెళ్ళినా జాగ్రత్తలు తప్పనిసరి. గుంపులుగా దర్శనాలకు వెళ్లొద్దు..

- హోటళ్ళు..రెస్టారెంట్ లు ఆక్కడి పరిస్థితులను బట్టే తినేందుకు వెళ్ళండి. బయట తిండి మానేయడమే శ్రేయస్కరం. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. అన్ని నిబంధనల్నీ కచ్చితంగా పాటిస్తున్నారన్న నమ్మకం మీకు కలిగాకే ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్ కి వెళ్ళండి.

- ఇక విందులు, వినోదాలు యధావిధిగా జరుపుకోవచ్చని ఏ మాత్రం అనుకోకండి. పుట్టినరోజు వేడుక.. పెళ్లి.. ఇలా ఏ సంబరమైనా 20 మంది కంటే ఎక్కువగా లేకుండా ఉండడమే శ్రేయస్కరం. మీ వేడుక మిగిలిన కుటుంబాలనూ.. జీవితాలనూ అస్తవ్యస్తంగా మార్చేలా కావడం మీకూ మంచిది కాదనే విషయం తెలియనిదేమీ కాదు కదా!

- స్వయం జాగ్రత్తలే శ్రీరామరక్ష అని గమనించండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories