Coronavirus : చైనాలో తెలుగు విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు

Coronavirus : చైనాలో తెలుగు విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరినీ వణికిస్తుంది. చైనాదేశంలో పుట్టిన మహమ్మారి ఇప్పటి వరకూ 132 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా 6 వేల మందిని...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరినీ వణికిస్తుంది. చైనాదేశంలో పుట్టిన మహమ్మారి ఇప్పటి వరకూ 132 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా 6 వేల మందిని ఆస్పత్రి పాలు చేసింది. అంతే కాక బుధవారం (జనవరి 29) ఒక్క రోజే ఈ వైరస్ సోకిన 1500 కొత్త కేసులు నమోదు చేసింది చైనా. దీంతో చైనా ప్రజలు మాత్రమే కాకుండా అక్కడున్న వివిధ దేశాల ప్రజలు కంటిమీద కులుకు లేకుండా జీవిస్తున్నారు. ఇక ఈ వైరస్ కు పుట్టినల్లయిన ఉహాన్ నగరంలో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది.

కాగా కొంత మంది తెలుగు ఇంజనీర్లు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా శ్రీసిటీలోని టీసీఎల్‌ కంపెనీకి ఎంపికైన శిక్షణ నిమిత్తం చైనాకు వెళ్లారు. దీంతో వారి తల్లిదండ్రులు ఇంజనీర్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను సురక్షితంగా భారత దేశానికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. దీంతో విదేశాంగ ప్రభుత్వం వారిని ఎలాగయినా సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగు ఇంజనీర్లను భారత దేశానికి వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానం పంపించే యోచనలో ఉన్నామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. కానీ దానికి మరికొంత సమయం పట్టవచ్చని అన్నారు. ప్రస్తుతం చైనా దేశం అక్కడ విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి పంపించడానికి అంగీకరించడం లేదని తెలిపారు. ఎంత గానో వ్యాప్తి చెందిన కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చాకే వారిని భారత్ కు తరలిస్తామని ఆ దేశం ఆంక్షలు విధించిందని తెలిపారు. కాగా వైరస్‌ ఇతర దేశాలు, ప్రాంతాలకు వ్యాపించకుండా చైనా కఠినమైన ఆంక్షలు విధించిందని, ఇప్పటివరకు ఏ ఒక్క భారతీయ విద్యార్థికి కూడా వైరస్‌ సోకలేదని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. భారతీయ విద్యార్థుల, ఇంజనీర్ల తల్లిదండ్రులు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని, వారికి వైరస్ సోకకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories