బోరున ఏడుస్తున్న కాశీ లో చిక్కుకున్న తెలంగాణ వాసులు

బోరున ఏడుస్తున్న కాశీ లో చిక్కుకున్న తెలంగాణ వాసులు
x
Highlights

ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రంలో తెలంగాణవాసులు చిక్కుకున్నారు. లాక్ డౌన్ తో కాశీలో చిక్కుకున్న తమకు సొంత ప్రాంతాలకు తరలించాలని కన్నీరుమున్నీరుగా...

ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రంలో తెలంగాణవాసులు చిక్కుకున్నారు. లాక్ డౌన్ తో కాశీలో చిక్కుకున్న తమకు సొంత ప్రాంతాలకు తరలించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రి, జనగామ ప్రాంతాలకు చెందిన 60 మంది కాశీకి బయలుదేరారు. ఈనెల 29 వరకు కాశీవిశ్వేశ్వరుని తోపాటు సమీప పుణ్యక్షేత్రాలను దర్శించుకునే తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది.

కరోనా ఎఫెక్టుతో దేశం మొత్తం లాక్ టౌన్ కావడంతో కాశీలో వున్న యాదాద్రి, జనగామ భక్తుల ట్రైన్ టికెట్లు రద్దయ్యాయి. దీంతో కాశీలోని లష్కర్ రోడ్డు టెంపుల్ వీధిలోని జస్ట్ లుక్ హోటల్ లోనే ఉండిపోయారు. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు వీరిని బయటకు వెళ్లనివ్వడంలేదు. 60 మంది సభ్యుల బృందంలో కొందరు వృద్ధ మహిళలు వున్నారు. నాలుగు రోజులుగా హోటల్ లోనే బందీలుగా వుండడంతో విలపిస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని కాశీలోని తమను స్వస్థలాకు తరలించాలని వేడుకుంటున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు ఇతర ప్రజాప్రతినిదులకు బాధితుల బంధువులు ఫోన్ లు చేసి సాయం కోరుతున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories