logo
జాతీయం

మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ...కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ...కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం
X
Highlights

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని...

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఫడ్నవీస్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ముంబై వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఫడణవీస్‌ను కేసీఆర్‌ ఆహ్వానిస్తారు.

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఫడ్నవీస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story