డ్రైవర్, ప్రయాణికుడికి మధ్య ప్లాస్టిక్ గ్లాస్.. టాక్సీ సంస్థ వినూత్న ప్రయత్నం..

డ్రైవర్, ప్రయాణికుడికి మధ్య ప్లాస్టిక్ గ్లాస్.. టాక్సీ సంస్థ వినూత్న ప్రయత్నం..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ప్రస్తుతం దీన్ని అరికట్టేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ప్రస్తుతం దీన్ని అరికట్టేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ప్రస్తుతానికి దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో భౌతిక దూరం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యక్తిగత శుభ్రత ఖచ్చితంగా పాటిస్తేనే కరోనా అరికట్టాలని దేశాలన్నీ బలంగా నమ్ముతున్నాయి. లాక్ డౌన్ అయిపోయినప్పటికి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నాయి.

ఇక భారత్ విషయానికి వస్తే కరోనా వైరస్ ని మరింతగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నీ మే 19 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులను ఇచ్చింది. అందులో భాగంగానే డ్రైవర్, ఒక్క ప్రయాణికుడితో టాక్సీ లను నడుకోవచ్చునని వెల్లడించింది. అయితే కేరళలోని ఓ టాక్సీ సంస్థ భౌతిక దూరం కచ్చితంగా పాటించాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించింది.. కారులో డ్రైవర్, ప్రయాణికుడికి మధ్య అడ్డుగా ప్లాస్టిక్ గ్లాసును బిగించింది. ఎర్నాకులం జిల్లా అధికారుల సూచన మేరకు తమ కార్లలో ఇలా ఏర్పాట్లు చేశామని సదరు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వారిని తరలించేందుకు జోన్ల వారీగా క్యాబ్ సర్వీసులకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories