Top
logo

క‌రోనాపై యుద్ధం: రతన్‌టాటా కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌రోనాపై యుద్ధం:  రతన్‌టాటా కీల‌క ప్ర‌క‌ట‌న‌Ratan Tata (File Photo)
Highlights

క‌రోనా మ‌హ‌మ్మ‌రిపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులున్న ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

క‌రోనా మ‌హ‌మ్మ‌రిపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులున్న ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా రతన్‌టాటా ముందుకు వ‌చ్చారు. ఏకంగా ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లు టాటా ట్రస్ట్‌, టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ తరపున రూ.500కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

క‌రోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశ అవసరాల కోసం టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంనీస్‌, టాటా ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుంద అని ట్వీట్‌ చేశారు. రూ.500 కోట్లను కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పరికరాలు, కరోనా నిర్ధారణ కిట్స్‌, కరోనా బాధితులకు చికిత్స అందించే సౌకర్యాలు మెరుగు పరచడానికి, హెల్త్‌ వర్కర్లు,ఈ మొత్తాన్ని వినియోగించ‌నున్న‌ట్లు తెలిపారు.

Web Titletata trust Announce five hundred crore rupees to fight from covid19
Next Story