సాహస వృద్ధులు: దొంగలను తరిమికొట్టిన ఓల్డ్ కపుల్

సాహస వృద్ధులు: దొంగలను తరిమికొట్టిన ఓల్డ్ కపుల్
x
Highlights

తమ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలకు వృద్ధ దంపతులు ముచ్చెమటలు పట్టించారు. ఆయుధాలతో వచ్చిన దొంగలను చూసి ఏమాత్రం భయపడకుండా, చేతికందిన వస్తువులను వారిపై విసిరికొట్టడంతో వారు తోకముడిచిన సంఘటన తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగింది.

తమ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలకు వృద్ధ దంపతులు ముచ్చెమటలు పట్టించారు. ఆయుధాలతో వచ్చిన దొంగలను చూసి ఏమాత్రం భయపడకుండా, చేతికందిన వస్తువులను వారిపై విసిరికొట్టడంతో వారు తోకముడిచిన సంఘటన తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరింది.

తమిళనాడు తిరునల్వేలిలోని వృద్ధ దంపతుల సాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది. తమపై దాడికి వచ్చిన దొంగలను తీవ్రంగా ప్రతిఘటించి తరిమికొట్టారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమేరాల్లో రికార్డ్ అవ్వడంతో వీరి సాహసం ప్రపంచానికి తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తోంది.

తమిళనాడులో తిరునల్వేలి జిల్లాలోని తిరుమంగళం గ్రామంలో ఈ ఫైట్‌ జరిగింది. రాత్రి సమయంలో ఇంటి బయట కూర్చున్న వృద్ధుడిపై వెనకగా వచ్చిన దుండగుడు మొదట దాడి చేశాడు. తువాలుతో అతడి మెడను చుట్టగా తప్పించుకునేందుకు పెద్దాయన తీవ్రంగా ప్రయత్నించారు. ఇంతలో మరో వ్యక్తి కూడా సీన్‌లోకి ప్రవేశించాడు. ఇద్దరూ మంకీ క్యాప్‌లు ధరించి ఉండటంతో గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయింది.

ఈ గందరగోళం పరిస్థితుల నేపథ్యంలో లోపలి నుంచి బయకు వచ్చిన పెద్దావిడ అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే తేరుకొని దుండగులపై చేతికి దొరికినదాన్ని విసరడం మొదలుపెట్టింది. దుండగుల దగ్గరున్న కత్తులకు ఏమాత్రం వెరవకుండా వృద్ధులిద్దరూ కుర్చీలతో దాడి చేశారు. ఒక్కసారిగా వృద్ధుల నుంచి ప్రతిఘటన ఎదురవ్వడంతో అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీల్లో రికార్డ్ అవ్వడంతో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వృద్ధదంపతులను ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories