అప్పటివరకు మా రాష్ట్రానికి విమానాలు వద్దు

అప్పటివరకు మా రాష్ట్రానికి విమానాలు వద్దు
x
Highlights

కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజారవాణా ఎక్కడికక్కడే స్తభించిపోయింది. ఇక తాజాగా

కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజారవాణా ఎక్కడికక్కడే స్తభించిపోయింది. ఇక తాజాగా కేంద్రం లాక్ డౌన్ ని మే31 వరకు పొడిగిస్తూ పలు మార్గదర్శకాలను సూచించింది. అందులో భాగంగా మే 25నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే తమిళనాడు సర్కార్ మాత్రం ఇప్పుడే మా రాష్ట్రానికి విమానాలు వద్దని కేంద్రాన్నీ కోరింది. దీనిని మే 31 వరకు నిలిపివేయాలని కోరింది.

చెన్నైలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరుగుతుండటంతో రాష్ర్టానికి విమాన సర్వీసులు ఇప్పట్లో మొదలు పెట్టకూడదని విమానయాన శాఖను పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం కోరింది. అంతేకాకుండా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెన్నైలో సరైన రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో లేవని వెల్లడించింది. ఇక తమిళనాడులో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 8795 కరోనా కేసులు నమోదవగా, 95 మంది మరణించారు.

ఇక దేశంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి గడిచిన 24 గంటల్లో ఇండియాలో అత్యధికంగా 6088 కేసులు నమోదు కాగా, 148 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో ఒక్క రోజులో అత్యధిక స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కి చేరుకుంది. ఇప్పటి వ‌ర‌కు మ‌న దేశంలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 3583కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఇందులో ఇప్పటివరకు 48,534మంది కోలుకోగా మరో 66,330మంది చికిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories