Top
logo

అమ్మ మరణం పై అనుమానం ఉంది : పన్నీర్ సెల్వం

అమ్మ మరణం పై అనుమానం ఉంది : పన్నీర్ సెల్వం
Highlights

తమిళనాడు ప్రజల ఆరాధ్య నేత జయలలిత మరణం జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు...

తమిళనాడు ప్రజల ఆరాధ్య నేత జయలలిత మరణం జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం విదితమే. అయితే, జయలలిత మరణించిన తరువాత ఆమె మరణం పై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. తమిళనాడు లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక సందేహాల్ని పలువురు వ్యక్తం చేశారు. ఇప్పుడు జయలలితకు అత్యంత సన్నిహితుడు, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అమ్మ మరణం పై తనకు సందేహాలున్నాయంటూ సరికొత్త సంచలనం రేపారు.

తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం సమావేశాల అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. అమ్మ మరణం మిస్టరీ లా ఉందని తాను అప్పుడే చెప్పానని ఆయన చెప్పారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తాను ఒక్కసారి కూడా వెళ్లి చూడలేదని ఆయన తెలిపారు. అందుకే ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరానని వివిరించారు. దీనిపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌‌లో ఆర్ముగస్వామి కమిషన్‌ను నియమించిందనీ, ఆ కమిటీ విచారణకు తాను హాజరు కాలేదనీ చెప్పుకొచ్చారు. తనను నాలుగు సార్లు పిలిచారనీ, అయితే, తనకు ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడంతో వేల్లలేకపోయాన్నారు. మరోసారి పిలిస్తే వెళ్లి తన వాదన వినిపిస్తానన్నారు. 2016 డిసెంబర్ 5న జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.

అయితే దాదాపు 75 రోజుల పాటు అత్యంత రహస్యంగా సాగిన చికిత్స, జయ ఆకస్మిక మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

Next Story

లైవ్ టీవి


Share it