తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం.. వైద్య సిబ్బందికి నెల జీతం అడ్వాన్స్

తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం.. వైద్య సిబ్బందికి నెల జీతం అడ్వాన్స్
x
Tamilnadu CM Palaniswamy (File Photo)
Highlights

కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కరోనా రోగులకు వైద్యం అందిస్తూ అహర్నిశలు కష్టపడుతున్న వైద్య సిబ్బందికి ఓ నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు..ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు.

అంతేకాకుండా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 1000 అందిస్తామన్నారు. నగదుతో పాటు, బియ్యం, పంచదార ఇతర నిత్యవసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. టోకెన్ల పద్ధతిలో నిత్యవసరాలనీ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.. ఇక లాక్ డౌన్ విధించిన రాష్ట్రాలలోని ప్రజలకి ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ తో పాటు వెయ్యి రూపాయలు అందిస్తున్నాయి. ఇందులో ఏపీలో రూ. 1000 అందిస్తుండగా తెలంగాణలో రూ.1500 అందిస్తుంది.

వైద్యుల సేవలు మరువలేనివి:

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివి. డాక్టర్లు నర్సులు ఇలా ప్రతి ఒక్కరు కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి నిత్యం తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారి సేవలను గుర్తించి తమిళనాడు సర్కార్ ఒక నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పదికి చేరిన మరణాల సంఖ్య:

ఇక కరోనా వైరస్ ప్రభావం వలన ప్రపంచంలో 16000 కేసులు నమోదయ్యాయి. భారత్లో 500 కేసులు నమోదు కాగా పదిమంది మృతి చెందారు. మహారాష్ట్ర కేరళలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories