Top
logo

పార్లమెంటు ఆవరణను శుభ్రం చేసిన హేమమాలిని

పార్లమెంటు ఆవరణను శుభ్రం చేసిన హేమమాలిని
X
Highlights

బీజేపీ పార్లమెంటు సభ్యురాలు హేమమాలిని 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు నడుం బిగించారు. పార్లమెంటు ఆవరణలోని రోడ్డును...

బీజేపీ పార్లమెంటు సభ్యురాలు హేమమాలిని 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు నడుం బిగించారు. పార్లమెంటు ఆవరణలోని రోడ్డును చీపురుకట్టతో శుభ్రం చేస్తూ సందడి చేశారు. త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల దృష్ట్యా 'స్వచ్ఛ భారత్ అభియాన్' డ్రైవ్ నడుస్తోంది. కళ్లకు కూలింగ్ గ్లాస్, చేతిలో చీపురుకట్టతో పార్లమెంటు ఆవరణను హేమమాలిని శుభ్రం చేస్తుండగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆమెతో కలిసారు. ఆ సన్నివేశాన్ని మీడియా తమ కెమెరాల్లో బంధించింది. పరిశుభ్రతా డ్రైవ్‌పై ఈ సందర్భంగా హేమమాలిని మాట్లాడుతూ, మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణను శుభ్రం చేసేందుకు స్పీకర్ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని అన్నారు. వచ్చే వారం మధురలో కూడా 'స్వచ్ఛభారత్ అభియాన్'లో తాను పాల్గొంటానని చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి 2 లక్షల 90 వేల ఓట్ల ఆధిక్యంతో హేమమాలిని గెలిచారు.

Next Story