సోనియాను ప్రధానిని కాకుండా అడ్డుపడ్డ సుష్మా

సోనియాను ప్రధానిని కాకుండా అడ్డుపడ్డ సుష్మా
x
Highlights

దేశ రాజకీయాల్లో అగ్ర నాయకురాలిగా ఎదిగిన సుష్మాస్వరాజ్‌.. ఒకానొక దశలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో పోటీపడ్డారు. మొదటిసారి సోనియా జాతియతను...

దేశ రాజకీయాల్లో అగ్ర నాయకురాలిగా ఎదిగిన సుష్మాస్వరాజ్‌.. ఒకానొక దశలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో పోటీపడ్డారు. మొదటిసారి సోనియా జాతియతను ప్రశ్నించడంతో సుష్మా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అంతేకాదు సోనియా ప్రధాని అయితే గుండు గీయించుకుంటానంటూ సుష్మా చేసిన ప్రమాణం ఆనాడు తీవ్ర కలకలం రేపింది.

సుష్మా స్వరాజ్ సోనియా చేతిలో 1999లో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో బళ్లారి నుంచి బరిలోకి దిగిన సోనియా గాంధీని ఎదుర్కొనేందుకు.. బీజేపీ సుష్మాను ప్రధానాస్త్రంగా ప్రయోగించింది. 1999 లోక్ సభ ఎన్నికల్లో సోనియా బళ్లారి నుంచి పోటీ చేయగా.. బీజేపీ సుష్మా స్వరాజ్‌ను ఆమెకు ప్రత్యర్థిగా నిలిపింది. విదేశీ కోడలికి, స్వదేశీ కూతురికి మధ్య పోటీగా బళ్లారి ఎన్నికను బీజేపీ ప్రచారం చేసింది. ఎన్నికల్లో సుష్మా కాంగ్రెస్ అధినేత్రికి ధీటుగా ప్రచారం నిర్వహించారు. నుదుటున పెద్ద బొట్టు, చీరకట్టుతో అచ్చమైన భారత నారిగా సుష్మా ప్రజల మదిలో నిలిచిపోయారు. బీజేపీ సుష్మాను ఆదర్శ భారత మహిళగా అభివర్ణించింది. అయితే ఆ ఎన్నికల్లో సోనియా సుష్మాను 56 వేల ఓట్ల తేడాతో ఓడించారు. కానీ కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది.

అనంతరం 2004 ఎన్నికల్లో యూపీఏ పక్షం మెజార్టీ సాధించింది. దీంతో సోనియా ప్రధాని పగ్గాలు చేపట్టాలని యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలు కోరారు. సోనియా ప్రధాని పీఠం మీద కూర్చుంటే.. తాను గుండు కొట్టించుకొని, తెల్ల చీర కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తానని సుష్మా స్వరాజ్ సంచలన ప్రకటన చేశారు. బ్రిటిషర్ల పాలన ముగిసినా కూడా.. సుదీర్ఘ పోరాటం అనంతరం దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా భారతీయులు ఇటలీలో జన్మించిన సోనియాను ప్రధానిగా ఎన్నుకోవడం ఏంటని సుష్మా ఆవేదన వ్యక్తం చేశారు.సోనియా ప్రధానిగా పగ్గాలు చేపట్టడం తగదంటూ.. సుష్మా స్వరాజ్ ఉధ్యమం ఉధృతం చేశారు.. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో సోనియా గాంధీ ప్రధాని పదవి తనకు వద్దని ప్రకటించాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories