Top
logo

తెలంగాణ బిడ్డ ఎదిగేందుకు పాటుపడతాం: ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి

తెలంగాణ బిడ్డ ఎదిగేందుకు పాటుపడతాం: ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి
Highlights

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ పాత్ర మరువలేనిది. 2014 ఫిబ్రవరి లోకసభలో ఏపీ పునర్విభజన బిల్లుపై కీలక...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ పాత్ర మరువలేనిది. 2014 ఫిబ్రవరి లోకసభలో ఏపీ పునర్విభజన బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో.. అప్పటికే ప్రత్యేక తెలంగాణ ఇచ్చితీరాల్సిందేనని మొండి పట్టుపట్టి, కాషాయం నేతలను ఒప్పించిన సుష్మా భావోద్వేగ ప్రసంగం చేశారు. సుష్మా స్వరాజ్ ప్రసంగిస్తూ... ఆరు దశాబ్దాలుగా పడుతున్న ప్రసవ వేదనను తీర్చే సమయం అసన్నమైంది. ఎందరో అమరవీరుల త్యాగాలు, మరెన్నో ఆత్మబలిదానాల మధ్య.. పండండి తెలంగాణ బిడ్డ జన్మించనుంది. మేమిచ్చిన వాగ్దానం మేరకు మా మాటని నిలబెట్టుకున్నాం. నేడు జన్మించునున్న తెలంగాణ బిడ్డ ఎదిగేందుకు పాటుపడుతాం... తెలంగాణ ప్రజలారా....తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తు పెట్టుకోవాలని ఆమె కోరారు.

తెలంగాణ చిన్నమ్మగా... ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతారు. తెలంగాణతో అనుబంధం పెంచుకున్న సుష్మా.... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చారు. అంతేకాదు తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బలమైన వాణి వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంలో కూడా ఎంతో కృషి చేశారు. ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ నిర్వహించిన ప్రతి ఆందోళనకు సుష్మా హాజరయ్యారు. ఆపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అగ్రనేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, జైట్లీలను ఒప్పించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సుష్మా, నిన్న రాత్రి తీవ్ర గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సుష్మా.... చికిత్స పొందుతూ మరణించారు. సుష్మాస్వరాజ్‌ అకాల మృతితో యావత్‌ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది.

Next Story