ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆగ్రహం.. నాలుగు రాష్ర్టాల సీఎస్‌ల హాజరుకు ఆదేశం

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆగ్రహం.. నాలుగు రాష్ర్టాల సీఎస్‌ల హాజరుకు ఆదేశం
x
Highlights

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి, భేసీ విధానం అమల్లో ఉన్న రోజుల్లో కాలుష్య తీవ్రత, మిగతా రోజుల్లో ఉన్న...

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి, భేసీ విధానం అమల్లో ఉన్న రోజుల్లో కాలుష్య తీవ్రత, మిగతా రోజుల్లో ఉన్న కాలుష్య తీవ్రత వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సుప్రీంకు అందజేసింది. దీనిపై విచారించిన ధర్మాసనం ఢిల్లీ రహదారుల్లో సరి భేసీ విధానం వల్ల ఉపయోగమేమీ లేదని స్పష్టం చేసింది.

కాలుష్య నియంత్రణ కోసం ప్రభావ వంతమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న సుప్రీం పంజాబ్, హర్యాన, యూపీ, ఢిల్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఈ నెల 29 న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. సరి భేసీ విధానం కాలుష్య నియంత్రణకు సరైన పరిష్కారం కాదన్న న్యాయస్థానం 3 చక్రాల వాహనాలు కలుగజేసే కాలుష్యంపై వారం రోజుల్లో నివేదిక అందజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. అలాగే గాలిలో నాణ్యతను పెంచడానికి మార్గదర్శకాలను 7 రోజుల్లో రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

keywords : Delhi, pollution, Supreme Court, Odd-Even scheme

Show Full Article
Print Article
More On
Next Story
More Stories