ఢిల్లీ సర్కార్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్ధానం

ఢిల్లీ సర్కార్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్ధానం
x
సుప్రీం కోర్టు ఫైల్ ఫోటో
Highlights

కరోనా కట్టడి చర్యలపై సర్వోన్నత న్యాయస్ధానం ఢిల్లీ సర్కార్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఢిల్లీ ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 రోగులను పశువుల కంటే హీనంగా...

కరోనా కట్టడి చర్యలపై సర్వోన్నత న్యాయస్ధానం ఢిల్లీ సర్కార్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఢిల్లీ ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 రోగులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తూ ఢిల్లీ ప్రభుత్వ నిర్వాకం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా రోగులకు ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందించడం లేదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్య తగ్గించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి చెందింది.

తక్షణమే కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడి చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యల్లో వైఫల్యంపై ఆందోళన చెందింది. మహమ్మారి బారినపడి మరణించిన వారి మృతదేహాల నిర్వహణ అమానుషంగా ఉందని వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను జూన్‌ 17కు వాయిదా వేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories