సుప్రీంకోర్టు ఉద్యోగికి కరోనా.. క్వారంటైన్‌కు ఇద్దరు రిజిస్ట్రార్‌‌లు

సుప్రీంకోర్టు ఉద్యోగికి కరోనా.. క్వారంటైన్‌కు ఇద్దరు రిజిస్ట్రార్‌‌లు
x
Highlights

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా దేశంలో ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా...

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా దేశంలో ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది . దీంతో సుప్రీం కోర్టు ఇద్దరు రిజిస్ట్రార్ల ను క్వారంటైన్ కు పంపారు. కరోనా సోకిన ఉద్యోగి గత వారం రెండుసార్లు కోర్టుకు వచ్చారట . దీంతో కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిసారనే దానిపై సిబ్బంది విచారణ జరుపుతున్నారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగపోతోంది గత 24 గంటల్లో 1543 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29435కి చేరింది. ఒక్క రోజే 62 మంది చనిపోవడంతో.. కరోనా వల్ల ఒకే రోజు ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 934కి చేరింది. ఓవైపు కరోనా కొంత వరకూ కంట్రోల్ అవుతోందనిపిస్తున్న సమయంలో తాజా లెక్కలు మరోలా ఉన్నాయి. ఇప్పటివరకు 6868 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 21632 యాక్టివ్ కేసులున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories