అయోధ్య కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

అయోధ్య కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
x
సుప్రీంకోర్టు
Highlights

అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు...

అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 18 రివ్యూ పిటిషన్‌లను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఐదురుగు సభ్యుల రాజ్యంగా ధర్మాసనం రివ్యూ పిటిషన్‌లపై ఛాంబర్‌లో అంతర్గత విచారణ జరిపింది. సీజే జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పిటిషన్లను తిరస్కరించింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, హిందూ మహాసభ, నిర్మోహి అఖాడాతో పాటు మరో 40 మంది రివ్యూ పిటిషన్ వేశారు. ఐతే ఆ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. నవంబరు 9న ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చిచెప్పింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories