సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు..అత్యాచార ఘటనలకు..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు..అత్యాచార ఘటనలకు..
x
బాబ్డే
Highlights

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలకు తక్షణ న్యాయం పరిష్కారం కాదన్నారు. జస్టిస్ అనేది ప్రతీకారం రూపంలో...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలకు తక్షణ న్యాయం పరిష్కారం కాదన్నారు. జస్టిస్ అనేది ప్రతీకారం రూపంలో ఉండకూడదన్నారు. అలా జరిగితే న్యాయం రూపు రేఖలు కోల్పోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ రేప్ కేసుల్లో త్వరగా తీర్పులు వెలువడాలన్న భావనను వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రవిశంకర్ వ్యాఖ్యలను సీజేఐ విభేదించారు. న్యాయ విచారణ పూర్తయిన తర్వాత శిక్షలు విధించాలన్నారు సీజేఐ. 'ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చేసి వీలైనంత త్వరగా న్యాయం చేయగలగాలి. ఆ న్యాయం ఆమోదయోగ్యంగా ఉండాలి.'అని చీఫ్ జస్టిస్ బాబ్డే అన్నారు. కొత్త కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే విధానం పెరగాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories