సైక్లింగ్ గర్ల్ జ్యోతి కుమారికి సూపర్ -30 striking ఆఫర్!

సైక్లింగ్ గర్ల్ జ్యోతి కుమారికి సూపర్ -30 striking ఆఫర్!
x
Highlights

కరోనా మహమ్మారి ఎందోరో వలస కూలీలను అష్టకష్టాల పాలు చేసింది.

కరోనా మహమ్మారి ఎందోరో వలస కూలీలను అష్టకష్టాల పాలు చేసింది. రెక్కాడితే కానీ డొక్కాడని వలస కూలీల జీవితాల్లో లాక్‌డౌన్‌ రావడంతో ఒక్కసారిగా వారి రెక్కలు నరికివేసినంత పనైంది. ఇటు వలస వచ్చి రాష్ట్రాల్లో ఉండలేక, అటు తమ స్వంత గ్రామాలకు వెల్లలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోన్నారు. " ఏమున్నదక్కో ఏమున్నదక్కా " అనే పాటలను తలపించేట్టుగా ముల్లే మూటా సర్దుకుని కాలినడకన సొంతూళ్ల బాట పట్టారు.

ఈ సమయంలో హృదయాలను కదిలించే ఎన్నో దీన గాథలు వెలుగులోకి వచ్చాయి. చిన్న చిన్న పిల్లలను తీసుకుని నడుస్తున్న తల్లిదండ్రులను చూసాం, ఆకలికి, ఎండకు తట్టుకోలేక చెట్టు పుట్ట కింద తలదాచుకున్న ఎంతో మంది కూలీలను చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షల మంది జీవితాల గాథలను మనం గుర్తుచేసుకోవచ్చు. ఆ కోవకు చెందిందే ఈ బాలిక కథ...

నిండా పదిహేనేళ్లు కూడా లేని ఓ బాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తన కన్న తండ్రిని 1200 కిలో మీటర్ల దూరం సైకిల్ పై ఎక్కించుకుని తన స్వగ్రామానికి చేరుకుంది. ఇంత సాహసం చేసిన బాలికే జ్యోతి కుమారి. ఆమె చేసిన సాహసానికి ప్రస్తుతం ఆమెపైన ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. అంతే కాదు ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావొద్దు అంటూ ఆ దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఈమె గాథ తెలిసిన ఎంతో మంది ఆమెపై సానుభూతి చూపిస్తుంటే పట్నాలోని ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థ సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్‌ ఆమె గాథ విని చలించిపోయి ఓ బంపర్ ఆఫర్ ను ఇచ్చారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక భవిష్యత్తులో ఐఐటీ చేయాలనుకుంటే తమ శిక్షణా సంస్థ ఆమెకు ఆహ్వానం పలుకుతుందని ట్వీట్ చేసారు. ఈ మేరకు తన సోదరుడు ప్రణవ్‌ను కూడా జ్యోతి ఊరికి పంపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన తన ట్విటర్‌లో షేర్ చేసారు.

అంతే కాదు జ్యోతికి మరో అద్భుతమైన అవకాశం కూడా లభించింది. గత వారంలోనే లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) జ్యోతి విద్యను అభ్యసించేందుకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకొచ్చింది. జ్యోతి ఏం చదవాలనుకున్నా వారు పూర్తి భాధ్యత తీసుకుని ఖర్చులు భరిస్తామని తెలిపింది. ఇంత మంచి విషయాన్ని విన్న జ్యోతి తండ్రి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆయన మాట్లాడుతూ తన కుమార్తె తీర్చుకోలేని దని, జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటానని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఎవరీ జ్యోతి కుమారి ఆమె తండ్రి...వారు ఏం చేస్తుంటారు..

జ్యోతికుమారి ఆమె తండ్రి మోహన్‌ ల స్వస్థలం బిహార్‌లోని దర్భంగ జిల్లా సిర్హులీ. వారు బతుకుదెరువుకోసం హరియాణాలోని గురుగ్రామ్‌ వెల్లి జీవనం సాగిస్తున్నారు. అక్కడ జ్యోతి తండ్రి మోహన్ ఆటోడ్రైవర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాదా సీదాగా కొనసాగుతున్న వారి జీవితంలో ఈ ఏదాడి జనవరిలో ఉప్పెన వచ్చి పడినట్లయింది. దురదృష్టవశాత్తు మోహన్ ప్రమాదానికి గురై కాలికి గాయం అవ్వడంతో అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. సరిగ్గా ఇదే సమయానికి కరోనా విజృంభించడం, ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో వారు ఎటూ పోలేని దుస్థితి రావడంతో కుమార్తెతో పాటు గురుగ్రామ్‌లోనే చిక్కుకున్నాడు.

అలాంటి సమయంలో ఇంటి యజమాని వారు ఇల్లు ఖాళీ చేయాలని పోరు. ఇలా అన్ని సమస్యలు ఒకదాని వెంట ఒకటి రావడంతో జ్యోతికి ఏం చేయాలో తెలియలేదు. గురుగ్రామ్‌లో ఉంటే తమకు కష్టాలు తప్పవని గ్రహించిన జ్యోతి సరకులకు తండ్రి ఇచ్చిన చివరి రూ.500లతో ఓ పాత సైకిల్‌ కొనుగోలు చేసింది. దానిపై తండ్రిని ఎక్కించుకుని దాదాపు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్హులీకి తీసుకెళ్లింది. ఈ ఘటన ఎందరినో కదిలించింది. అంతే కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా జ్మోతి విషయంలో చలించిపోతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories