వంట గ్యాస్‌ ధర తగ్గింది

వంట గ్యాస్‌ ధర తగ్గింది
x
Highlights

ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలు వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 1.46 రూపాయల మేర తగ్గించాయి. దీంతో సబ్సిడీ...

ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలు వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 1.46 రూపాయల మేర తగ్గించాయి. దీంతో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 493.53లుగా ఉంది. ఇక రూ.689గా ఉన్న సబ్సిడీయేతర​ సిలిండర్‌ ధర రూ.30 తగ్గింది. ఇది రూ.659గా ఉండనుంది. గురువారం అర్థరాత్రి నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కాగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గడం వరుసగా ఇది మూడవ సారి. గతేడాది డిసెంబర్ 1న సబ్సిడీ సిలిండర్ ధర రూ.6.52 పైసలు తగ్గింది. అలాగే కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31న వంటగ్యాస్ సిలిండర్ పై రూ.5లను తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. సబ్సిడీ లేని సిలిండర్ కు రూ. 120 తగ్గించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, డాలరు మారకంలో రూపాయి విలువ బలపడడంతో దేశీయంగా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories