ఓ యువతా 'మేలుకో'రే ప్రభుత్వానికి సహకరించు!

ఓ యువతా మేలుకోరే ప్రభుత్వానికి సహకరించు!
x
Highlights

ప్రభుత్వాల తీరెలా ఉన్నా ప్రజల ఆలోచనా ధోరణి కూడా ఇక్కడ ఆక్షేపనీయమే. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ వైరస్ ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో తెలియని విధంగా...

ప్రభుత్వాల తీరెలా ఉన్నా ప్రజల ఆలోచనా ధోరణి కూడా ఇక్కడ ఆక్షేపనీయమే. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ వైరస్ ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో తెలియని విధంగా వ్యాపించి ఉండటంతో ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని నేతలు కోరుతున్నారు. ఎంతో మంది ప్రముఖులు, వీఐపీలు కూడా స్వచ్ఛందంగా హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరిహద్దుకు చేరుకున్న విద్యార్థులు క్వారంటైన్‌కు ఒప్పుకోకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆక్షేపనీయంగా ప్రజల ఆలోచనా ధోరణి. క్వారంటైన్‌కు విద్యార్థులు ససేమీరా. ప్రాణాలు పోతున్నా.. అలర్ట్‌ కాని స్టూడెంట్స్

వేలకు వేలు ఖర్చు పెట్టాం తమను తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలంటున్న వారంతా క్వారంటైన్‌కు మాత్రం ససేమీరా అన్నారు. అంతవరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వారంతా వెనక్కి వెళ్లేందుకు సిద్ధపడ్డారు కానీ వైద్యం చేయించుకోడానికి మాత్రం ముందుకు రాలేదు. తమకెలాంటి వైరస్ లేదని పైకి చెబుతున్నారు కూడా. కానీ కరోనా సోకినా అది బయటపడాలంటే కనీసం 14 రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు వారు సాధారణంగానే ఉన్నట్లు కనిపిస్తారు. ఈ విషయం తెలిసినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించారు. ఇటు గరికపాడు దగ్గర నుంచి వెనక్కు వెళ్లిన వారంతా ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకున్నారు.

యూరప్‌తో పాటు అమెరికా, ఇరాన్‌ వంటి దేశాల పరిస్థితి కళ్లముందే కదలాడుతున్నా కరోనా విషయంలో మాత్రం మనవాళ్లలో కనీస స్పృహ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తమకు కష్టమొచ్చిందని తమ సొంతింటికి వెళ్లనీయకుండా అడ్డుకోవడమేంటనే కోపాన్ని తెచ్చుకుంటున్నారు కానీ మన మధ్యే ఉన్న మహమ్మారిని మర్చిపోయారు. దాని బారిన పడితే ప్రాణాలే పోతాయనే విషయాన్ని పట్టించుకోలేదు. వారి ఆక్రోశాన్ని వెలిబుచ్చారు కానీ అసలు విషయాన్ని అంగీకరించడం లేదు.

క్వారంటైన్ లో 14 రోజులు ఉండటాన్ని వ్యతిరేకించడం అవగాహన లేమిని ప్రదర్శించినట్లే. ఈ సమయంలో తమ ఆరోగ్యంతో పాటు.. చుట్టూ ఉన్న ప్రజలు.. వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే ఇలాంటి క్లిష్ట తరుణంలో ప్రజలు క్వారంటైన్‌కు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వైద్య పరీక్షలకు ఒప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకంగా ప్రవర్తించడం వారి ఆలోచనా ధోరణి ఏవిధంగా ఉందో తెలియజేస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories