SSC CHSL 2019 నోటిఫికేషన్ విడుదల

SSC CHSL 2019 నోటిఫికేషన్ విడుదల
x
Highlights

ఇంటర్ పాసైన నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్తను తెలియజేసింది.

ఇంటర్ పాసైన నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్తను తెలియజేసింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2020 సంక్షిప్త ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ను డిసెంబరు 3న విడుదల చేయనుంది SSC. నోటిఫికేషన్ విడుదలైన రోజునుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని విభాగాలలోని లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 3 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాని తెలిపారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 1 వరకు కొనసాగనుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.

విద్యార్హత : ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2, టైర్-3 ఆన్ లైన్ పరీక్షలు

పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.12.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.01.2020.

SSC CHSL 2019 ఫేజ్-1 పరీక్ష: 2020 మార్చి 16 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories