లేడీ ఫైనాన్స్‌ మంత్రిగా అరుదైన అవకాశం..భారతదేశ రెండో ఆర్థిక మంత్రిగా రికార్డు

లేడీ ఫైనాన్స్‌ మంత్రిగా అరుదైన అవకాశం..భారతదేశ రెండో ఆర్థిక మంత్రిగా రికార్డు
x
Highlights

మోడీ 2.0 కేబినెట్‌లో నిర్మలాసీతారామన్‌ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఉన్న నిర్మల తొలిసారి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు....

మోడీ 2.0 కేబినెట్‌లో నిర్మలాసీతారామన్‌ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఉన్న నిర్మల తొలిసారి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ప్రధాని తర్వాత ఆర్థికమంత్రినే నెంబర్‌2గా భావిస్తారు. కొత్త ఆర్థికమంత్రి తెలుగువారి కోడలు కావడం విశేషమైతే... రక్షణ శాఖ నుంచి ఆర్థిక శాఖను భుజానికెత్తుకున్న రెండో మహిళ మంత్రి కావడం మరో విశేషం. ఇంతకీ డిఫెన్స్‌ నుంచి వచ్చిన నిర్మలమ్మ ఫైనాన్స్‌‌తో అకౌంట్స్‌ ఎలా క్లియర్‌ చేయబోతున్నారు.?

నిర్మలా సీతరామన్ జాతీయ రాజకీయాల్లో ఈ పేరిప్పుడు మారుమోగుతోంది. డిఫెన్స్ మినిస్టర్‌గా సత్తాచాటిన ఈ తెలుగింటి కోడలు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా రికార్డ్ సృష్టించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా ఈ ఘనత దక్కించుకున్న మహిళగా నిలిచారు. కేంద్ర మంత్రిమండలిలో ఆర్థిక శాఖ ఎంతో కీలకమైనది. ఇప్పుడీ అవకాశం కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి నిర్మలా సీతారామన్‌కు దక్కింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో సేవలు అందించిన మహిళగా పేరుకెక్కిన ఈమె ఈ అరుదైన ఘనత సాధించారు. దేశ ఆర్థిక మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిర్మలా చరిత్ర సృష్టించారు.

మరోవైపు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1970-71లో ఆర్థిక శాఖను ఆమె వద్దే అంటిపెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆర్థిక శాఖను నిర్వహించిన రెండో మహిళగా నిర్మల నిలిచారు. దేశ తొలి మహిళా రక్షణ శాఖమంత్రిగా కూడా నిర్మల రికార్డు నెలకొల్పారు. ఆర్ధిక శాఖను స్వతంత్ర భారతదేశ పార్లమెంట్ పూర్తిస్థాయి కేబినెట్‌ మహిళ మంత్రిగా బాద్యతలు నిర్వహించలేదు. మొదటి డిఫెన్స్ మినిస్టర్‌గా పూర్తి బాధ్యతలు నిర్వహించి చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ ఇప్పుడు ఆర్థిక శాఖను భుజానికెత్తుకోవడం సంచలనమే.

కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మలా సీతరామన్ తమిళనాడులోని సీతాలక్ష్మీ రామస్వామీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీలోనే జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. ఎక్కువ కాలం పాటు ఆర్ధిక శాఖను చేపట్టిన చిదంబరం కాగా మొత్తం స్వతంత్ర్య భారత దేశంలో ఇప్పటి వరకు 24 మంది ఆర్ధికశాఖను నిర్వర్తించారు. అందులో ప్రధానమంత్రులుగా ఉన్న జవహర్‌లాల్‌నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌లు ఆర్ధిక శాఖను తమ వద్దే ఉంచుకున్నారు. చరిత్రలో మొదటిసారి ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఆర్ధిక శాఖను కూడ నిర్వహించిన మహిళగా ఇందిరాగాంధీ నిలిచారు.

సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టే స్థాయికి చేరిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్‌. అందునా పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రి, పూర్తిస్థాయి ఆర్థిక శాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలనే కావడం విశేషం. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంఫిల్ పట్టా పొందారు. తొలినాళ్లలో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలయ్యారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జాతీయ కార్యవర్గంలో చేరాలన్న పార్టీ ఆహ్వానంతో 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories