'ఫాస్టాగ్‌' నేరగాళ్ల తాట తీస్తుంది!

ఫాస్టాగ్‌ నేరగాళ్ల తాట తీస్తుంది!
x
ఫాస్టాగ్‌
Highlights

ఫాస్టాగ్‌ నేరగాళ్ల తాట తీస్తుంది. నేరాలు చేసి ఈజీగా తప్పించుకోవడం ఇక సాధ్యం కాకపోవచ్చు. నేరం చేసి హైవేపై ఏ మూల నుంచి వెళ్లిన పట్టుకోవడం ఖాయం....

ఫాస్టాగ్‌ నేరగాళ్ల తాట తీస్తుంది. నేరాలు చేసి ఈజీగా తప్పించుకోవడం ఇక సాధ్యం కాకపోవచ్చు. నేరం చేసి హైవేపై ఏ మూల నుంచి వెళ్లిన పట్టుకోవడం ఖాయం. నెంబర్‌పేట్ల్‌ మార్చినా ఒక్క స్టిక్కర్‌తో పట్టుబడిపోతున్నారు. నేర పరిశోధనలకు కొత్తరూపం రావడంతో పాటు నకిలీలకు చెక్‌పడే అవకాశం ఉంది. నేరస్తుల పాలిట ఫాస్టాగ్‌ పై స్పెషల్‌స్టోరీ

ఫాస్టాగ్‌ టోల్‌గేట్ల దగ్గర పేమెంట్లను ఈజీగా చెల్లించేందుకుకాదు ఇకపై ఈ విధానం నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారనుంది. హైవేలపై జరిగే నేరాలను ఇకపై ఈజీగా చేధించేందుకు ఉపయోగపడనుంది. దోపిడీలు, హత్యలు చేసి ఏ లారీలోనో లేక కార్లోనో పారిపోదామనుకుంటే ఇక కుదరదు. ఫాస్టాగ్‌ సాయంతో ఫాస్ట్‌గా నేరాస్తులను పట్టుకునేందుకు వీలు కలగనుంది.

ఫాస్టాగ్‌ టోల్‌గేట్ల రుసుము చెల్లింపుకు మాత్రమే కాదు భవిష్యత్తులో పెట్రోలు-డీజిల్ కొనుగోలు, వాహన బీమా ప్రీమియం, పార్కింగ్ ఫీజు, ట్రాఫిక్ చలాన్లు వంటి అవసరాలన్నింటికి చెల్లింపులు చేసే విధంగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సో రానున్న రోజుల్లో ఏ వాహనానికైనా ఈ ట్యాగ్‌ ఉండాల్సిందే. ఇదే ఇప్పుడు పోలీసులకు నేర పరిశోధనకు ఆయుధంగా మారుతోంది.

నేరాస్తులు సాధారంగా తప్పించుకునేందుకు నెంబర్‌ఫ్లేట్‌ మార్చడం లాంటివి చేస్తారు. లేదంటేపూర్తిగా తీసేస్తారు. ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌ వంటివి ఫోర్జరీ ద్వారా కొత్తవి సృష్టిస్తారు. కానీ ఇకపై అలాంటివి సాధ్యం కాదు. ఫాస్టాగ్‌లో ఏ వాహనం ఏ రోడ్ల మీద ఏ సమయంలో ప్రయాణించిందీ స్పష్టంగా నమోదవుతుంది. అంటే నేరం చేసిన వారు కార్లోనో లేక మరొ వాహనంలోనో పారిపోతే వారు ఇక పట్టుబడినట్లేనన్న మాట. ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌, భీమా వంటి వివరాలు కూడా నకిలీవి ఉపయోగించడానికి వీలుకాదు. ఫాస్టాగ్‌తో పరిశోధనకు కొత్తరూపు రావడంతో కేసులను వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories