Top
logo

పట్టాలు తప్పిన రైలు.. ఆరుగురి మృతి

పట్టాలు తప్పిన రైలు.. ఆరుగురి మృతి
Highlights

రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటన బీహార్‌లోని హాజీపూర్‌ జరిగింది. ఆదివారం వేకువజామున 3.52 గంటల ...

రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటన బీహార్‌లోని హాజీపూర్‌ జరిగింది. ఆదివారం వేకువజామున 3.52 గంటల సమయంలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రైలు అజ్మీర్‌నుంచి జైపూర్‌ జంక్షన్‌ వైపు వెళ్తుండగా ఇంజన్‌ పట్టాలు తప్పి బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, మరో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే భద్రతా సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సు ద్వారా దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల సహాయార్థం రైల్వే శాఖ హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు.. సోన్సూర్ - 06158 221645, హజీపూర్ - 06224 272230, బరౌని- 06279 232222.

Next Story


లైవ్ టీవి