Top
logo

Maharashtra: షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భారీ విరాళం.. ఎంతంటే?

Maharashtra: షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భారీ విరాళం.. ఎంతంటే?
Highlights

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు....

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తమకు చేతనైనంత విరాళం అంజేశారు. తాజాగా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ సైతం భారీగా విరాళం ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.51 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపింది.

కరోనాపై పోరాటానిక అందరం చేయి చేయి కలపాలని ప్రజలకు పిలుపునిచ్చింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా 724 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా మహారాష్ట్రలో 130 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడిన వారిలో 15 మంది కోలుకోగా ఇప్పటివరకు అక్కడ నాలుగు మరణాలు చోటుచేసుకున్నాయి.



Web TitleShri Saibaba Sansthan Trust donated Rs 51 Crore to Maharashtra Chief Minister's Relief Fund to fight the COVID19
Next Story