మోటార్ వెహికిల్ చట్టం అమలు చేయాల్సిందేనా.. వాహనదారులకు పెనాల్టీల మోత తప్పదా...?

మోటార్ వెహికిల్ చట్టం అమలు చేయాల్సిందేనా.. వాహనదారులకు పెనాల్టీల మోత తప్పదా...?
x
మోటార్ వెహికిల్ చట్టం అమలు చేయాల్సిందేనా
Highlights

పార్లమెంట్‌ చట్టాలు అమలు చేసి తీరాల్సిందేనా..? గత ఏడాది తీసుకొచ్చిన మోటార్ వెహికల్ యాక్ట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందా..? ట్రాఫిక్ ఉల్లంఘునలపై భారీ...

పార్లమెంట్‌ చట్టాలు అమలు చేసి తీరాల్సిందేనా..? గత ఏడాది తీసుకొచ్చిన మోటార్ వెహికల్ యాక్ట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందా..? ట్రాఫిక్ ఉల్లంఘునలపై భారీ చలాన్లపై కనికరం చూపిస్తే ఆర్టికల్ 356 కింద చర్యలు తప్పవా..?

గత ఏడాది తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ యాక్టు 2019 నిబంధనలు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. మోటార్ వెహికిల్ చట్టంలో మార్పు, ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై భారీ చలాన్లు విధిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసింది కేంద్రం. అంత వరకు ఉన్న జరిమానాలు రెట్టింపు లేదా నాలుగు ఐదు రెట్లు పెంచుతూ కఠిన శిక్షలు విధిస్తూ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. మోటార్ వెహికిల్ యాక్టు 2019 ని కచ్చితంగా అమలు చేసి తీరాలని స్పష్టం చేసింది. చట్టంలో కంటే తక్కువగా ఏ రాష్ట్రం అమలు చేయకూడదని తేల్చి చెప్పింది. తక్కువ పెనాల్టీలు విధిస్తూ రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోకూడదంటూ అడ్వజరీలో పేర్కొంది.

అయితే తక్కువ జరిమానాలు, శిక్షలు విధించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి తీరాలని స్పష్టం చేసింది. ఆ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరని తెలిపింది. దీంతో గత సెప్టెంబర్‌ 1 నుంచి సవరించిన ఎంవీ యాక్టు అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ పెనాల్టీలపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు దీని అమలు నిలిపి వేయడంతో పాటు శిక్షలు తగ్గించాయి. ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా పాత చలాన్‌ రేట్లు, శిక్షలనే అమలు చేస్తూ వస్తోంది.

గతంలో డ్రైవిగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే 500 రూపాయలు పెనాల్టీ ఉండేది. ఇప్పుడు 5వేలకు పెంచారు. రాష్ డ్రైవింగ్‌ చేస్తే వెయ్యి రూపాయల నుండి 5 వేల రూపాయలకు పెంచింది. డ్రంక్ అండ్ డ్రైవ్ 2వేల నుండి 10వేలకు , మెహికిల్ పర్మిట్‌పై 5వేల నుండి 10వేలకు పెంచారు. రేస్‌లు నిర్వహిస్తే 600 రూపాయల నుండి 6వేలకు పెంచింది. సీట్‌ బెల్ట్ ధరించకపోతే వంద రూపాయల నుండి వెయ్యికి, ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడింగ్‌పై వంద రూపాయల నుండి 2వేలకు పెంచడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే రూ. వెయ్యి నుండి 2వేల రూపాయలకు పెంచుతూ మోటార్ వెహికిల్ యాక్టు 2019లో పేర్కొంది.

కేంద్రం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఆర్టికల్ 256 కింద నోటీసులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే ఆర్టికల్ 356 కింద నిబంధనలను అమలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. భారీ చలాన్లపై వాహనదారులు మండిపడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories