ట్రబుల్‌ షూటర్‌ సక్సెస్.. రెబెల్ ఎమ్మెల్యేను ఒప్పించిన డీకే శివకుమార్

ట్రబుల్‌ షూటర్‌ సక్సెస్.. రెబెల్ ఎమ్మెల్యేను ఒప్పించిన డీకే శివకుమార్
x
Highlights

కర్నాటక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్ విస్తృత...

కర్నాటక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామాలపై జూలై 16 వరకు యధాతథ స్థితి కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఈలోగా పరిస్థితులను చక్కబెట్టేందుకు డీకే చకచకా పావులు కదుపుతున్నారు. ఇవాళ తెల్లవారు జామునే నాగరాజ్ ఇంటికి వెళ్లిన శివకుమార్ దాదాపు నాలుగున్నర గంటల పాటు నాగరాజు నివాసంలోనే మంతనాలు జరిపారు. డీకే స్వయంగా తన నివాసానికి వచ్చి చర్చలు జరిపడంతో నాగరాజ్ మెత్తబడినట్టు కనిపించారు. ఈ భేటీ అనంతరం నాగరాజ్ తాజా పరిస్థితులను వివరించారు. పరిస్థితులను బట్టి రాజీనామాలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. నాగరాజు మాతోనే ఉంటారని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని శివకుమార్ అన్నారు. నాగరాజ్‌ కాంగ్రెస్‌కి వీధేయుడని పార్టీలోనే కొనసాగుతారని డీకే శివకుమార్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories