వెనక్కి తగ్గిన శివసేన.. రాష్ట్రపతి పాలనపై..

వెనక్కి తగ్గిన శివసేన.. రాష్ట్రపతి పాలనపై..
x
Highlights

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికీ 15 రోజులైంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పార్టీలు మద్దతును కూడగట్టుకోలేకపోతున్నాయి. అయితే...

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికీ 15 రోజులైంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పార్టీలు మద్దతును కూడగట్టుకోలేకపోతున్నాయి. అయితే శివసేన మాత్రం తాము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి గవర్నర్ ను కొంత సమయం కోరింది. గవర్నర్ మాత్రం అదనపు సమయం ఇవ్వడానికి ససేమీరా అన్నారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ శివసేన తరపున సునిల్‌ ఫెర్నాండెజ్‌ నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీంతో స్పందించిన కోర్టు బుధవారం ఉదయం 10.30 గంటలకు దీని గురించి రిట్‌ పిటిషన్‌లో పేర్కొనాలని న్యాయస్థానం తెలిపింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన పిటిషన్ పై శివసేన వెనక్కు తగ్గి ఈ పిటిషన్‌పై బుధవారం ఏ విధమైన విచారణ కోరట్లేదని స్పష్టం చేసింది. తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం తాము ఎలాంటి కొత్త పిటిషన్లు దాఖలు చేయట్లేదని ఆ పార్టీ తరపు న్యాయవాది సునిల్‌ ఫెర్నాండెజ్‌ తెలిపారు. రాష్ట్రపతి పాలనపై ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎన్‌సీపీ, కాంగ్రెన్‌ నుంచి మద్దతు లభించిన తర్వాతే కొత్త పిటిషన్‌ దాఖలు చేస్తామని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories