మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం
x
Highlights

ఉత్కంఠ రేకెత్తిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన నేత, కేంద్రమంత్రి అరవింద్‌ సావంత్‌ తన పదవికి రాజీనామా...

ఉత్కంఠ రేకెత్తిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన నేత, కేంద్రమంత్రి అరవింద్‌ సావంత్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శివసేనవైపే నిజం ఉంది. ఇలాంటి తప్పుడు వాతావరణంలో ఢిల్లీ ప్రభుత్వంలో ఇంకా ఎందుకు ఉండాలి. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. ఢిల్లీలో దీనిపై మీడియా సమావేశం నిర్వహిస్తా అని ట్విటర్‌లో అరవింద్‌ సావంత్‌ ప్రకటించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో గవర్నర్‌ శివసేనను ఆహ్వానించారు. అయితే అరవింద్‌ సావంత్‌ తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన అడుగులు వేస్తోంది. అయితే శివసేనకు కాంగ్రెస్‌, ఎన్సీసీల మద్దతు తప్పనిసరి. శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ఆ పార్టీ ఎన్డీయే నుండి బయటకు రావాల్సిందేనని ఎన్సీపీ షరతు విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు రావాలంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆహ్వానించారు. అయితే అనూహ్యంగా ఆ పార్టీ వెనక్కి తగ్గి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గవర్నర్‌ ఆహ్వానం నేపథ్యంలో బీజేపీ కోర్‌ కమిటీ ఆదివారం రెండుసార్లు భేటీ అయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడణవీస్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ఏర్పాటుకున్న సాధ్యాసాధ్యాలను చర్చించారు. శివసేన మద్దతు ఇవ్వకపోవడం వల్ల తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు తెలియజేశారు. ఆ వెంటనే శివసేనకు గవర్నర్‌ ఆహ్వానం పంపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆ పార్టీని కోరారు. దీనిపై ఇవాళ సాయంత్రం 7.30 గంటలలోపు తమ వైఖరిని తెలియజేయాలని శివసేన శాసనసభా పక్షనాయకుడు ఏక్‌నాథ్‌ షిండేను కోరారు.

అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రం ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తమ అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియజేశారు. మరోవైప కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. 208శాసనసభ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ కలిసి పోటీ చేసిన శివసేన 56స్థానాల్లో గెలుపొంది రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో గెలుపొందాయి. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఈ ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు శివసేకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు తప్పనిసరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories